నాచారం టెలిఫోన్ ఎక్సేంజి సమీపంలో కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున నగరానికి చేరుకున్న లారీని పక్కన అపి ఆ లారీ డ్రైవర్, క్లీనర్ అడ్రస్ కనుకొనేందుకు రొడ్డుపై ఉన్న స్థానికులను అడుగుతున్నారు. ఆ క్రమంలో వేగంగా వచ్చిన ఓ కారు డ్రైవర్, క్లీనర్లను ఢీ కొట్టింది.
దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే సమీపంలోని నాచారంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.