హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన హెడ్‌మాస్టార్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నాచారంలోని మల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(15)పై హెడ్‌మాస్టర్ కారుడ్రైవర్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి అని గుర్తించిన తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.