
ముంబై భిమాండి టవర్స్‌లో అగ్నిప్రమాదం
ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబై వర్లీలోని భిమాండి టవర్స్‌లోని 32వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్చలు ప్రారంభించారు. బిల్డింగ్‌లో ఉన్న 95 మందిని కాపాడామని, మంటలనార్పడానికి 8 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయని తెలిపారు అధికారులు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. వారం వ్యవధిలో ముంబైలో మూడో అతిపెద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.
దీపిక పదుకోన్ ఇళ్లు ఇక్కడే...
ఇదిలా ఉండగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఇళ్లు కూడా ఇదే భవనంలో ఉందని సమాచారం. దీపికా ఈ భవనంలోని 26వ అంతస్తులో ఉంటున్నట్లు సమాచారం.అయితే ప్రమాదం జరిగింది దీపిక ఉన్న అపార్ట్‌మెంట్‌లో కాదని, ఆ సమయంలో దీపిక కూడా అక్కడ లేదని ఆమె సన్నిహితులు మీడియాకు తెలిపారు. 2010లో దీపిక ఈ భవనంలో ఒక అపార్ట్‌మెంట్‌ను ఆమె తండ్రి ప్రకాశ్ పదుకోన్ పేరున కొన్నట్లు సమాచారం.