ఏవోబీలో కూంబింగ్ ముమ్మరం | AOB combing intensified for Maoists | Sakshi
Sakshi News home page

ఏవోబీలో కూంబింగ్ ముమ్మరం

Published Tue, Jan 6 2015 11:23 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

AOB combing intensified for Maoists

ఖమ్మం :  ఖమ్మం జిల్లా మర్రిమళ్ల అటవీప్రాంతంలో గ్రేహౌండ్స్ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం వద్ద మావోయిస్టులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం దోనుబాయి అటవీప్రాంతంలో గ్రైహౌండ్స్ దళాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగి అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. ఇటు పోలీసులు... అటు మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో గిరిజనులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా గిరిజన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల రాకపోకలను అధికారులు నిషేధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement