ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి | 4 naxals killed in encounter in Chattisgarh | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి

Published Tue, Jan 10 2017 2:08 PM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM

4 naxals killed in encounter in Chattisgarh

నారాయణపూర్‌:  ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులు, జ‌వాన్లపై మావోయిస్టులు కాల్పులు జ‌రిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పుల‌కు దిగ‌డంతో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు. అనంత‌రం ఘ‌ట‌నాస్థలం నుంచి పోలీసులు ప‌లు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న స‌మ‌యంలో ఈ కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో బ‌ల‌గాలు ఇంకా కూంబింగ్ కొన‌సాగిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement