ఛత్తీస్గఢ్: మరోసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బతగిలింది. పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుని నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఈ ఘటన శుక్రవారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా హల్లూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఎదురుకాల్పుల్లో ఓ కమాండర్ సహా నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలి వద్ద భారీగా మందుగుండు సామాగ్రి పోలీసులకు లభ్యమైంది. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Published Fri, Nov 13 2015 1:15 PM | Last Updated on Sat, Jul 28 2018 8:20 PM
Advertisement
Advertisement