Four Maoist killed
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
చర్ల: తెలంగాణ సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఎస్సై నేలకొరగగా నలుగురు కీలక మావోయిస్టులు మృతి చెందారు. మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్దోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మాటు వేసి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై శ్యాంకిశోర్ శర్మను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. మృతి చెందిన మావోయిస్టులను కాంకేర్ డివిజినల్ కమిటీ సభ్యుడు అశోక్ రైను, ఏరియా కమిటీ సభ్యుడు కృష్ణ నరేటి, ఎల్ఓఎస్ సభ్యులు సవితా సలామే, పర్మిలలుగా గుర్తించారు. వీరిలో అశోక్‌పై రూ.8 లక్షల రివార్డు, కృష్ణపై రూ.5 లక్షలు, మిగతా ఇద్దరిపై రూ. లక్ష చొప్పన రివార్డు ఉన్నట్లు రాజ్‌నంద్‌గావ్ ఏఎస్పీ తెలిపారు. వీరికి మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన పలు ఘటనలతో సంబంధముందన్నారు. ఏకే–47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్, రెండు 12–బోర్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్కౌంటర్లో నలుగురు మావోలు మృతి
చర్ల/మల్కన్‌గిరి: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుకుమా జిల్లా జేగురుగొండ– చింతల్నార్ పోలీస్ స్టేషన్ల సరిహద్దులోని బీమాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మాటువేసి ఉన్న మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరపడంతో, పోలీసులు సైతం ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు హతమయ్యారు. కాల్పుల అనంతరం మృతదేహాల వద్ద ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు .303 రైఫిళ్లు, ఒక బర్మార్ తుపాకీ, పేలుడు సామగ్రి,, నిత్యావసర వస్తువులు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నలుగురిలో దుధి హిడ్మా, ఆయ్‌తే అనే ఇద్దరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు కూడా ఉందని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని దక్షిణ బస్తర్ డీఐజీ సుందర్రాజ్ తెలిపారు. -
ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి
నారాయణపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులు, జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో బలగాలు ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. -
ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి
-
భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్: మరోసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బతగిలింది. పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుని నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా హల్లూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఎదురుకాల్పుల్లో ఓ కమాండర్ సహా నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలి వద్ద భారీగా మందుగుండు సామాగ్రి పోలీసులకు లభ్యమైంది. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.