హిరమండలం: మండలంలోని కల్లట గ్రామంలో ఆది వారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పలి ఉషకు చెందిన పూరిళ్లు కాలి బూడిదైంది. ఇంటిలోని వస్తు సా మగ్రితో పాటు దుస్తులు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. సు మారు రూ.50 వేలు నష్టం జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. బాధితురాలికి బియ్యంతో పాటు రేషన్ సరుకులు అందించారు. ఆయనతో పాటు సర్పంచ్ ఐ.విజయలక్ష్మి, ఆర్‌ఐ, వీఆర్వో, గ్రామ పెద్దలు నర్సింగరావు తదితరులు ఉన్నారు.