విజయవాడ: గొల్లపూడిలోని హోల్‌సేల్ మార్కెట్ వద్ద రోడ్డుపై ఆపి ఉన్న శ్రీ బాలాజీ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ దగ్ధమైంది. ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం ఎదుట పార్క్ చేసిన లారీలో ప్లాస్టిక్, స్టీల్ వస్తువులు, కేబుల్ వైర్లు, వస్త్రాల బండిళ్లు లోడ్ చేశారు. వీటిని రాజమండ్రికి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఉన్నట్లుండి లారీలో ఉన్న లోడ్ నుంచి పొగలు వెలువడ్డాయి. ఇది గమనించిన ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది సామగ్రిని పరిశీలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మంటలు మిగతా వస్తువులకు కూడా అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
లారీలో సుమారు రూ.30 లక్షల విలువైన సరకు ఉన్నట్లు ట్రాన్స్‌పోర్ట్ యజమాని శేఖర్ రెడ్డి చెబుతున్నారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయో తెలియడంలేదని ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది చెబుతున్నారు. లారీలో లోడ్ చేసిన వస్తువుల్లో రసాయన పదార్థాలుంటే వాటివల్ల కూడా మంటలు వచ్చే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. నష్టం వివరాలను అధికారులు లెక్కిస్తున్నారు.
లోడ్ లారీ దగ్ధం.. భారీ నష్టం!
Published Sun, Feb 19 2017 10:50 AM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM
Advertisement