
భారీగా ఎగసిపడుతున్న మంటలు పక్క భవనాలకు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను రంగంలోకి దింపినట్టు..
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని కన్నింగ్ వీధిలో ఉన్న బంగారీ మార్కెట్‌లో గల ఓ భవనంలో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. భారీగా అగ్నికిలల ఎగసిపడుతుండంతో 30కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలు పక్క భవనాలకు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను రంగంలోకి దింపినట్లు నగర మేయర్ సోవన్ ఛటర్జీ తెలిపారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మేయర్ ప్రకటించారు.