విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓబీసీ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభివించింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
విజయవాడ : విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓబీసీ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభివించింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఏటీఎం మిషన్కు మంటలు వ్యాపించకపోవటంతో నష్టం తప్పింది. కాగా ఏసీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనతో ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.