ఫైర్ ‘సేఫ్టీ’ ఏదీ? | Fire breaks out at workshop; no casualty reported | Sakshi
Sakshi News home page

ఫైర్ ‘సేఫ్టీ’ ఏదీ?

Published Mon, Mar 16 2015 2:24 AM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

ఫైర్ ‘సేఫ్టీ’ ఏదీ? - Sakshi

ఫైర్ ‘సేఫ్టీ’ ఏదీ?

అగ్నిప్రమాదాల నివారణలో అధికారుల వైఫల్యం
అరకొర వసతులతో ఫైర్ విభాగం సతమతం
సకాలంలో స్పందించలేకపోతున్న సిబ్బంది
45 కిలోమీటర్ల దూరం నుంచి ఫైరింజన్ల రాక
అప్పటికే బుగ్గిపాలవుతున్న ఆస్తులు

మెహదీపట్నం: అగ్ని ప్రమాదాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. ఎన్నిమార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా..

ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో శ్రద్ధ చూపడం లేదు. తాజాగా ఆదివారం విజయ్‌నగర్‌కాలనీలోని ఐటీఐ గిల్డ్‌లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఫైర్, జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రిసిటీ, కార్మిక శాఖ విభాగాల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా చెప్పుకోవచ్చు.  

ప్రమాదం చోటుచేసుకోక ముందే ఇలాంటి వర్క్‌షాపుల వద్ద పాటించాల్సిన భద్రతా చర్యలపై ఏ ప్రభుత్వ శాఖ కూడా స్పందించలేదు. గౌడాన్స్‌లు, వర్క్‌షాపుల యజమానులు పాటించాల్సిన కనీస నిబంధనలను సైతం కనిపెట్టలేకపోయారు. కనీసం ప్రమాదం చోటుచేసుకున్న కొద్ది నిముషాలలో మంటలు ఆర్పేందుకు సరైన వసతులు ఫైర్ విభాగం వద్ద లేవు. చాలిచాలనీ సిబ్బంది, అరకొర ఫైరింజన్లతో కుంటుతున్న ఫైర్ విభాగం దీనస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఫైర్ విభాగానికి సరైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తే తగిన సమయంలో తగిన విధంగా సిబ్బంది స్పందించి వేగవంతంగా మంటలను ఆర్పేస్తారు.

ఆదివారం సాయంత్రం 4.45 గంటలకు చిన్నపాటి అగ్నిప్రమాదమే చోటుచేసుకుంది. ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి వచ్చినా, వారివద్ద తగినన్ని  వాహనాలు లేకపోవడంతో మంటలను ఆర్పడం కష్టమైంది. ఒక మూలన మంటలను అదుపు చేస్తుంటే మరో వైపునుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో రాత్రి 8.45 గంటలకు మంటలు పూర్గిగా అదుపులోకి వచ్చాయి. తగినన్ని ఫైరింజన్లు నగరంలోనే ఉంటే గంట వ్యవధిలో మంటలను అదుపులోకి తేవచ్చు. విజయ్‌నగర్ కాలనీలోని ఘటనా స్థలానికి నగరానికి 45 కిలో మీటర్ల దూరంలో నున్న స్టేషన్ల నుంచి ఫైరింజన్లను రప్పించాల్సి వచ్చింది.

నగరం నడిబొడ్డున ఫైరింజన్లు లేకపోవడంతో సనత్‌నగర్, ఇబ్రహీంపట్నం నుంచి కూడా ఫైరింజన్లను రప్పించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రమాదం చోటుచేసున్న నిముషాల వ్యవధిలోనే నాలుగైదు ఫైరింజన్లు వచ్చివుంటే ఇంత పెద్ద భారీ స్థాయిలో ప్రమాదం చోటుచేసుకునేది కాదు. ఇక అదృష్టవశాత్తు ఐటీఐ గిల్డ్‌కు నాలుగు వైపులా రహదారులే ఉన్నాయి. రహదారి దాటిన తరువాతనే కాలనీలు, బస్తీలు ఉన్నాయి. ఐటీఐ గిల్డ్‌కు ఈ బస్తీలు ఆనుకుని ఉంటే నాలుగు గంటల పాటు ఎగిసిన మంటలకు బస్తీలు కూడా బుగ్గిపాలయ్యేవి. ఐటీఐ గిల్డ్‌కు ఆనుకునే చిన్న పిల్లల స్పెషాల్టీ దవాఖానా ఉంది. ఘటన సమయంలో ఇందులో ఉన్న రోగులు బయటికి పరుగులు తీశారు. పొగతో సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement