
గాంధీనగర్: గుజరాత్‌లో వల్సాద్‌లోని పేపర్ మిల్లులో శుక్రవారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్థానికులు పోలీసులు,ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. 20 ఫైరింజన్‌లో సహయంతో మంటలను అదుపులోకి తెవడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అగ్నిమాపక అధికారి అంకిత్ లోట్టే తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేవు. దీపావళి సందర్బంగా కార్మికులు పూజలో ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. పేపర్ మిల్‌కు నిన్న.. సెలవు దినం కావడంతో కార్మికులు ఎవరు రాలేదు. దీంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు లోనయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment