valsad
-
Gujarat: పట్టాలు తప్పిన గూడ్సు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
గుజరాత్‌లోని వల్సాద్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగపోయినా, ఈ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రయాణికులు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.గూడ్స్ రైలు సూరత్ వైపు వెళుతుండగా ముంబై-అహ్మదాబాద్ ట్రంక్ మార్గంలో డుంగ్రీ స్టేషన్ సమీపంలో బోగీ ఒకటి అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. అయితే రైలు వేగం ఎక్కువగా లేకపోవడంతో బోగీ బోల్తా పడలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన కోచ్‌ను ట్రాక్‌పై నుంచి తొలగించి, రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చూశారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవలికాలంలో రైలు బోగీలు పట్టాలు తప్పుతున్న కేసులు పెరుగుతుండడంతో రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈశాన్య రైల్వేలోని బారాబంకి-గోరఖ్‌పూర్ జోన్‌లోని మోతీగంజ్-జిలాహి స్టేషన్ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన పలువురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. BIG BREAKING 🚨⚡Another Day, Another Train Accident as one more goods train derailed in Valsad, Gujarat todayAnother PR opportunity for that shameless Reel Minister 👏 pic.twitter.com/Gyfde5JQvb— Ankit Mayank (@mr_mayank) July 19, 2024 -
‘ఏ’ అంటే ఆదివాసీలు
అహ్మదాబాద్: ‘‘నాకు ‘ఏ’ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతో గుజరాత్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో గతంలో డాక్టర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా కప్రాడా తాలూకా నానా పోంధా గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆ గుజరాత్, మై బనావ్యూ చే(ఈ గుజరాత్‌ను నేను తయారు చేశా) అనే కొత్త నినాదానికి మోదీ శ్రీకారం చుట్టారు. ప్రసంగం మధ్యలో ప్రజలతో పలుమార్లు ఈ నినాదాన్ని పలికించారు. రెక్కల కష్టంతో గుజరాత్‌ను తాము తయారు చేశామని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి హృదయం నుంచి వస్తున్న ప్రతి శబ్దం ‘ఆ గుజరాత్, మై బనావ్యూ చే’ అని చెబుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజార్టీతో నెగ్గబోతున్నట్లు తనకు సమాచారం అందిందని, పాత రికార్డులను బద్దలు కొట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన రికార్డుల కంటే భూపేంద్ర పటేల్(గుజరాత్ సీఎం) రికార్డులు బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని వివరించారు. రాష్ట్ర ప్రజల కోసం చాలినంత సమయం కేటాయిస్తానన్నారు. రాష్ట్ర ప్రగతి స్ఫూర్తిదాయకం ప్రజాసేవ అనేది గుజరాత్ సంప్రదాయం, సంస్కృతిలో ఒక భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదివాసీలు, ఇతర వర్గాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్ ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ గుజరాత్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని తెలిపారు. తన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు పనిచేసిన వారంతా అభివృద్ధి కోసం శ్రమించారని ప్రశంసించారు. దుష్టశక్తులకు పరాజయమే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్న దుష్టశక్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదని చెప్పారు. అలాంటి శక్తులు రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. -
భారీ అగ్నిప్రమాదం: మంటలను అదుపుచేస్తున్న 20 ఫైరింజన్లు..
గాంధీనగర్: గుజరాత్లో వల్సాద్‌లోని పేపర్ మిల్లులో శుక్రవారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్థానికులు పోలీసులు,ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. 20 ఫైరింజన్లో సహయంతో మంటలను అదుపులోకి తెవడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అగ్నిమాపక అధికారి అంకిత్ లోట్టే తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేవు. దీపావళి సందర్బంగా కార్మికులు పూజలో ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. పేపర్ మిల్కు నిన్న.. సెలవు దినం కావడంతో కార్మికులు ఎవరు రాలేదు. దీంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు లోనయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పంజాబీ డ్రెస్‌లో దొరికిపోయాడు!
సూరత్: లాక్డౌన్లో భార్యాభర్తలకు ఒకరి ముఖాలు మరొకరు చూసుకోలేక తలలు తిప్పుకుంటే ప్రేమికులు మాత్రం దూరంగా ఉంటూ విరహ వేదన అనుభవిస్తున్నారు. లాక్డౌన్ విధించి ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది. ఇప్పట్లో దీన్ని ఎత్తేస్తారో లేదో కూడా తెలీదు. దీంతో తన ప్రేయసిని చూడకుండా ఎదురుచూపులతో కాలం వెళ్లదీయడం తన వల్ల కాదనుకున్నాడో ప్రేమికుడు. ప్రేయసి కోసం అమ్మాయి అవతారం ఎత్తి అందరి కన్నుగప్పి ఆమె ముందు వాలిపోదామనుకున్నాడు. కానీ అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమ పాఠాలకు లాక్డౌన్ అడ్డొచ్చిపడింది. దీంతో ఎలాగైనా అమ్మాయిని కలవాలనుకున్నాడు. ప్రజారవాణా బంద్ ఉండటంతో బైక్‌పై వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. (లాక్డౌన్ లవ్: యాచకురాలితో ప్రేమ, ఆపై) అమ్మాయిలనైతే పోలీసులు ఆపరనుకున్నాడో ఏమో కానీ, పంజాబీ డ్రెస్ వేసుకుని తలమీద దుపట్టా ధరించి, ఫేస్ మాస్క్ పెట్టుకుని మంగళవారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో పయనమయ్యాడు. వల్సాద్ ప్రాంతంలోని పోలీసులు అతడిని నిజంగానే అమ్మాయిగా భావించి అడ్డుకోలేదు. కానీ మరోసారి అదే రూట్లో బైక్ మీద వెళుతుండటం చూసి అతని వాహనాన్ని అడ్డుకున్నారు. "ఈ సమయంలో ఎందుకు బయటకు వస్తున్నారు?" అని ప్రశ్నించారు. గొంతు విప్పితే దొరికిపోతానన్న భయంతో అతడు చేతి ద్వారా సంజ్ఞలు చేశాడు. అతడి తీరుతో అనుమానం వచ్చిన పోలీసులు ఈసారి దుపట్టా తీసి మాట్లాడాల్సిందిగా రెట్టించి అడగ్గా అసలు నిజం బయటపడింది. పోలీసులు, తన ప్రియురాలి తల్లిదండ్రులు గుర్తించకుండా ఉండేందుకు ఇలా అమ్మాయి వేషధారణతో గర్ల్ ఫ్రెండ్‌ను కలిశానని పేర్కొన్నాడు. కాగా లాక్డౌన్ నిబంధనల కింద పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. (‘13ఏళ్లు ఒంటరిగానే.. ఇంకెంత కాలం?’) -
ఈ సారి వల్సాద్ తీర్పు ఏంటి?
ఆ లోక్‌సభ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.1957 నుంచి 2014 ఎన్నికల వరకు ఇదే జరిగింది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం వస్తుందో నిర్ణయిస్తున్న ఆ నియోజకవర్గం వల్సాద్. గుజరాత్లో ఉంది. ఒక్కసారి మినహా ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీయే కేంద్రంలో అధికారం చేపట్టింది. ఈ నియోజకవర్గంలో 1967 వరకు కాంగ్రెస్ అభ్యర్ధిదే గెలుపు. అప్పటి వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 1971లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని కాంగ్రెస్ చీలిక వర్గం కాంగ్రెస్(ఓ) అభ్యర్థి గెలిచారు. అయితే, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఐ కేంద్రంలో అధికారం చేపట్టింది. దీన్ని మినహాయిస్తే మిగతా ఎన్నికల్లో ఎప్పుడూ వల్సాద్ జోస్యం తప్పు కాలేదు. అత్యవసర పరిస్థితి అనంతరం 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు. ఆ ఎన్నికల్లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ కేంద్రంలో గద్దెనెక్కింది. ఇందిరా గాంధీ హత్య దరిమిలా 1984లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌ను గెలిపించారు. అప్పట్లో రాజీవ్ గాంధీ నియోజకవర్గ పరిధిలోని లాల్ దంగ్రిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టింది. 1989లో ఈ నియోజకవర్గం జనతాదళ్‌కు ఓటు వేసింది. ఆ పార్టీ నేత వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. 1991 ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో వల్సాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పటేల్ గెలిచారు. పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 1996,1998,1999 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం బీజేపీకి పట్టం కట్టింది. మూడు సార్లు కూడా బీజేపీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2004 ఎన్నికల్లో సోనియా గాంధీ లాల్ దంగ్రీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించింది. ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక 2014లో మోదీ హవా ప్రభావం ఇక్కడ కూడా పడింది. వల్సాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ మొదటి సారి లోక్‌సభలో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వల్సాద్ ను మొదట్లో బల్సార్గా పిలిచేవారు. పునర్విభజన తర్వాత దీనిపేరు వల్సాద్‌గా మారింది. ఇక్కడి 16 లక్షల ఓటర్లలో 11 లక్షల మంది ఎస్టీలే. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు ఎస్టీలకు రిజర్వుచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జితు చౌదరి, బీజేపీ నుంచి కెసీ పటేల్ పోటీ చేస్తున్నారు. -
500 మంది మతమార్పిడి
గుజరాత్లో క్రైస్తవులను హిందువులుగా మార్చిన వీహెచ్‌పీ కేరళలో 30 మంది దళిత క్రైస్తవులను కూడా... క్రైస్తవులందరినీ మార్చేదాకా మార్పిడి సాగుతుందని వెల్లడి హిందుత్వాన్ని కాపాడే మా ప్రభుత్వం వచ్చింది: సింఘాల్ వాల్సద్ (గుజరాత్)/అలప్పుజ (కేరళ): ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఇటీవల 200 మంది ముస్లింలను హిందూ మతంలోకి ధరమ్ జాగరణ్ సమితితోపాటు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ బజ్రంగ్ దళ్ మార్చడంపై దుమారం చెలరేగుతుండగానే గుజరాత్, కేరళలలోనూ తాజాగా మతమార్పిళ్లు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లోని వాల్సద్‌లో ఉన్న అర్నాయ్ గ్రామంలో శనివారం 100 కుటుంబాలకు చెందిన 500 మంది గిరిజన క్రైస్తవులను హిందూ మతంలోకి మార్చిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం కేరళలోని అలప్పుజ జిల్లాలో 8 కుటుం బాలకు చెందిన 30 మంది దళిత క్రైస్తవులను తిరిగి హిందూ మతంలోకి చేర్చింది. వాల్సద్‌లో గిరిజనులను తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే ముందు మహా యజ్ఞం నిర్వహించిన వీహెచ్‌పీ అనంతరం వారందరికీ భగవద్గీతలు, రాముని పటాలు, రుద్రాక్ష మాలలను అందించింది. గతంలో క్రైస్తవంలోకి మారిన వీరంతా తిరిగి హిందూ మతంలోకి వచ్చేందుకు సుముఖత చూపడంతో ఈ కార్యక్రమం (ఘర్ వాపసీ) నిర్వహించినట్లు వీహెచ్‌పీ స్థానిక నేత అజిత్ సోలంకి తెలిపారు. క్రైస్తవులంతా స్వచ్ఛందంగానే తిరిగి మతం మార్చుకున్నారన్నారు. హిం దూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన గిరిజనులకు ముందుగా ఆశచూపినట్లుగా తిం డి, విద్య లభించలేదన్నారు. క్రైస్తవులంతా తిరిగి హిందూ మతంలోకి వచ్చేంత వరకూ ‘ఘర్ వాపసీ’ ప్రక్రియను కొనసాగిస్తామన్నారు.కాగా, స్వచ్ఛంద కార్యక్రమం కావడం వల్ల ఇందులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధి నితిన్ పటేల్ తెలిపారు. ఇక కేరళలోని కాణిచానల్లోర్‌లో ఉన్న ఓ గుడిలో ఘర్ వాపసీ కార్యక్రమంలో ఎనిమిది దళిత క్రైస్తవ కుటుంబాలకు చెందిన 30 మందిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చారు. మరో 150 క్రైస్తవ కుటుంబాలు తిరిగి హిందూమతం పుచ్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాయని కేరళ వీహెచ్‌పీ నేత పాడిక్కల్ తెలిపారు. కాగా, ఆగ్రాలో ముస్లింల మతమార్పిడి మోసపూరితమని యూపీ మైనారిటీ కమిషన్ పేర్కొంది. ‘హిందూ జనాభా 100 శాతానికి చేరుస్తాం’ భోపాల్: దేశంలో హిందూ జనాభాను ప్రస్తుతమున్న 82 శాతం నుంచి 100 శాతానికి చేరుస్తామని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆదివారమిక్కడ అన్నారు. హిందువుల సంఖ్య సగానికి పడిపోయి మైనారిటీల స్థాయికి పడిపోవడాన్ని ఉపేక్షించబోమన్నారు. ఆ చట్టం బాధ్యత విపక్షాలదే: అమిత్ సాక్షి, చెన్నై: సంఘ్ పరివార్‌కు చెందిన కొన్ని సంస్థలు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతుండటంపై దుమారం రేగిన నేపథ్యంలో మతమార్పిళ్ల నిరోధక చట్టం తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని...అందుకు మద్దతివ్వాల్సిన బాధ్యత విపక్షాలదేనని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. లౌకికవాదులమని చెప్పుకొనే ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వం తేవాలనుకుంటున్న మతమార్పిళ్ల నిరోధక చట్టానికి మద్దతిచ్చే దమ్ముందా? అని చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ షా సవాల్ విసిరారు. అభివృద్ధి ఎజెండా నుంచి తమ ప్రభుత్వాన్ని ఎవరూ పక్కకు నెట్టలేరని షా వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోనే కూటమి ఉంటుందని, సీఎం అభ్యర్థి పేరు ప్రకటించాకే ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. భాగవత్ వ్యాఖ్యలపై మోదీ మౌనమేల? సంఘ్ పరివార్ సంస్థలు చేపడుతున్న మతమార్పిళ్లను సమర్థించడంతోపాటు దీన్ని వ్యతిరేకించే పార్టీలు దమ్ముంటే మతమార్పిళ్ల నిరోధక చట్టానికి మద్దతివ్వాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సీపీఎం మండిపడ్డాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించాయి. -
ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం మీదే!
ఇప్పుడు గుజరాత్ లో అందరి చూపూ వల్సడ్ లోకసభ నియోజకవర్గం పైనే. ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారో కేంద్రంలో అధికారం వారిదే. మొదట్నుంచీ దక్షిణ గుజరాత్ లోని ఈ నియోజవకర్గం అధికారపక్షానికి అనుకూలమే. అందుకే అందరూ దీన్ని గేట్ వే టు ఢిల్లీ అంటారు. 1996 లో తొలి సారి వల్సడ్ బిజెపి చేతికి వచ్చింది. అప్పుడు వాజ్ పేజీ పదమూడు రోజుల ప్రభుత్వం ఏర్పడింది. 1998, 1999 లో వల్సడ్ లో మళ్లీ బిజెపి గెలిచింది. వాజ్ పేయీ మళ్లీ ప్రధాని అయ్యారు. 2004 లో కాంగ్రెస్ అభ్యర్థి కిషన్ పటేల్ గెలిచారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2009 లోనూ మళ్లీ కిషన్ పటేల్ గెలిచారు. ఈ సారి రెండో సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సారి మళ్లీ కిషన్ పటేల్ ఎన్నికల బరిలో ఉన్నారు. బిజెపి తరఫున మాజీ వైద్య మంత్రి డా. కెసి పటేల్ పోటీలో ఉన్నారు. 1977 నుంచి వచ్చిన ఫలితాలు చూస్తూ ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ అయిదు సార్లు, బిజెపి మూడు సార్లు, ఇండిపెండెంట్లు రెండు సార్లు గెలిచారు. ఇండిపెండెంట్లు గెలిస్తే కాంగ్రెసేతర, బిజెపిఏతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గంలో 14.95 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో ధోదియా, కూంకనా, వర్లి, కోలి, ఓబీసీ, హల్ పతి, మత్స్యకారులు, ముస్లింలు, భీల్ గిరిజనులు ప్రధానం. ఈ సారి పది మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ సారి వల్సడ్ గత చరిత్రను కంటిన్యూ చేస్తుందా లేక కొత్త ట్రెండ్ సృష్టిస్తుందా చూడాలి.