కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో దుకాణంలో నిల్వ చేసిన టైర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న అగ్నిప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.