Nadyala
-
థియేటర్లో అలజడి రేపిన పవన్ ఫ్యాన్స్.. ఇంకెప్పుడు మారుతారో..!
పవన్ కల్యాణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సుమారు 12 ఏళ్ల క్రితం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడమే కాకుండా కొన్ని చోట్లు కనీసం రెండురోజులు కూడా ఆడలేదు. అలాంటి అట్టర్‌ఫ్లాప్ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రీరిలిజ్ చేశారు. అందులో తప్పేం లేదు. కానీ సినిమా థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ అలజడి రేపారు. నంద్యాలలో ఏఆర్ మినీ థియేటర్‌తో పాటు పాలకొల్లులోని మారుతి టాకీస్‌లో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సినిమా రన్ అవుతున్న సమయంలో స్క్రీన్కు దగ్గర్లోనే మంటలు వేసి డ్యాన్సులు చేశారు. జనసేన పార్టీ జెండాలు చేతబట్టి కేకలు వేస్తూ ఊగిపోయారు. థియేటర్లో వెదజల్లిన పేపర్లను తీసుకొచ్చి మంటలపై వేయడంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. వెంటనే థియేటర్ యాజమాన్యం అప్రమత్తం కావడం.. ఆపై వెంటనే మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో థియేటర్లో సుమారు 400 మంది ఉన్నట్లు సమాచారం. కొన్ని థియేటర్ల వద్ద పవన్ ఫ్లెక్సీలకు బీరుతో అభిషేకం చేయడం మరింత శోచనీయం. (బ్రో సినిమా సమయంలో ఫైల్ ఫోటో) పవన్ ఫ్యాన్స్‌కు ఇదేమీ కొత్త కాదు.. ఖుషీ, తొలిప్రేమ చిత్రాలు రీరిలీజ్ సమయంలో కూడా ఇలాంటి చిల్లర పనులే ఆయన ఫ్యాన్స్ చేశారు. 'బ్రో' సినిమా రిలీజ్ సమయంలో పార్వతీపురంలోని సౌందర్య థియేటర్లో వాళ్లు చేసిన రచ్చ మరింత పీక్స్‌కు వెళ్లింది. స్క్రీన్‌పై పవన్ కనిపించగానే వెంటనే కొందరు తెరపై పాలాభిషేకాలు మొదలపెట్టారు. అదే సమయంలో తోపులాట మొదలైంది. ఆ గొడవలో తెర చిరిగిపోయింది. తెర చించిన వ్యక్తుల్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. పవన్ సినిమా విడుదలయిన ప్రతిసారి ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని జరుగుతూనే ఉన్నాయి. (ఇదీ చదవండి: రాజకీయాలపై కొణిదెల ఉపాసన కామెంట్స్) అభిమానంతో ఇలాంటి పిచ్చి పనులు చేయడమేంటి అంటూ ఎవరైనా కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తే.. తిరిగి వారిపై భూతులతో తిరగబడటం పవన్ ఫ్యాన్స్ నైజం అయిపోయింది. ఇంత జరుగుతున్న పవన్ మాత్రం ఫ్యాన్స్‌ను ఒకసారి కూడా హెచ్చరించడు. అందుకే వారు కూడా ఇలాంటి పనులు చేసేందుకు ఏమాత్రం వెనకాడరు.ఇకనైన పవన్ ఫ్యాన్స్‌లో మార్పు వస్తుందని ఆశిద్దాం. -
‘ఫ్యాక్షన్ రాజకీయాలను సహించేది లేదు’
సాక్షి, కర్నూలు: దళిత న్యాయవాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బరాయుడుని దారుణంగా హత్య చేయడాన్ని ఎమ్మెల్యే శిల్ప రవీంద్ర కిషోర్ ఖండిస్తూ.. టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళిత న్యాయవాది సుబ్బరాయుడిని టీడీపీ నాయకులు హత్య చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే చంద్రబాబు ఈరోజు దళిత న్యాయవాది టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైతే ఎక్కడున్నారని మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ రాజకీయాలు నంద్యాలలో చేస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాల ప్రాంతాన్ని భూమా కుటుంబం వారి రాజకీయ లబ్ధి కోసం అరాచకాలు, హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవాది హత్య కేసుపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి హత్య కుట్ర వెనక ఉన్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. సుబ్బరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడైన మనోహర్ గౌడ్ భూమా కుటుంబానికి ఆర్థికంగా, రాజకీయంగా నమ్మిన బంటు అన్నారు. ఈ హత్యకు భూమా కుటుంబం ఆజ్యం పోసిందనేది ప్రజలందరూ గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
నంద్యాలలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
భుమాకు షాక్: వైఎస్ఆర్సీపీలోకి చాబోలు గ్రామస్థులు
-
నంద్యాల సమరం
-
నంద్యాలలో శిల్ప ప్రచార హోరు
-
పాత నోట్లతో పెళ్లింట గొడవ
నంద్యాల: పెద్ద నోట్ల రద్దు కొత్తగా పెళ్లయ్యే వారికి శాపంలా మారింది. కొన్ని చోట్ల పెళ్లిళ్లు రద్దు చేసుకుంటుండగా.. మరి కొన్ని చోట్ల పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలోని కొత్తవీధిలో బుధవారం జరగాల్సిన ఓ పెళ్లి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. పెళ్లి కుమారుడి తండ్రి కట్నంగా తనకు కొత్త నోట్లే కావాలని బీష్మించుకు కూర్చోవడంతో కొంత గందరగోళం తలెత్తింది. పెద్దలందరూ కలిసి ఆయనకు సర్దిచెప్పడంతో రవి-ఈశ్వరీ అనే నవ దంపతుల పెళ్లి జరిగింది. -
నంద్యాలలో టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో దుకాణంలో నిల్వ చేసిన టైర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.