ముంబయిలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి! | 2 Dead In Fire At Maker Tower In Mumbai's Cuffe Parade | Sakshi
Sakshi News home page

ముంబయిలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి!

Published Tue, Oct 18 2016 8:47 AM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM

2 Dead In Fire At Maker Tower In Mumbai's Cuffe Parade

ముంబయి : దక్షిణ ముంబయిలోని కఫె పరేడ్ ప్రాంతంలోని మేకర్ టవర్స్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 20 అంతస్తుల భవనంలో ఈ రోజు ఉదయం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడే సరికి టవర్స్‌లోని పలువురు భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.  మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

అలాగే మంటల్లో చిక్కుకున్న 11మందిని సురక్షితంగా రక్షించారు. కాగా దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. కాగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎండీ శేఖర్ బజాజ్ ఫ్లాట్ నుంచి ముందుగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు  సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement