సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం మల్కాపురం మండలం యారాడ గ్రామం ఆదివారం విషాదం చోటుచేసుకుంది. యారాడ ఘట్‌రోడ్డు పై ఉన్న డాల్ఫిన్ కొండ దిగుతుండగా విశాఖ నావెల్ డక్ యార్డ్‌కు చెందిన ఫైర్ ఇంజన్ బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో ఫైరింజన్ అదుపుతప్పి ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫైర్ ఇంజన్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమ్మిత్తం వారందరినీ విశాఖలోని ఐఎన్‌ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తరలించారు.
నెవల్ డక్‌యార్డ్‌కు చెందిన కొందరు ఉద్యోగులు డాల్పిన్ కొండ మీద ఫంక‌్షన్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫైర్‌ఇంజన్‌తో నీళ్లు తీసుకెళుతుండగా బ్రేకులు ఫెయిలయ్యి ఈ ప్రమాదం సంబవించినట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. కాగా, గతంలో కూడా అనకాపల్లికి చెందిన రెండు స్కూల్ బస్సులు ఇక్కడే ప్రమాదానికి గురయ్యాయి. ఆ ఘటనలో 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులు రోజు యారాడ నుంచి సిందియా వరకు 8 ట్రిప్పుల మేర తిరుగుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రక్షణ గోడ ఏర్పాటు చేయాలని అక్కడి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment