yarada ghat road
-
లోయలో పడిన ఫైరింజన్; సిబ్బందికి గాయాలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం మల్కాపురం మండలం యారాడ గ్రామం ఆదివారం విషాదం చోటుచేసుకుంది. యారాడ ఘట్‌రోడ్డు పై ఉన్న డాల్ఫిన్ కొండ దిగుతుండగా విశాఖ నావెల్ డక్ యార్డ్‌కు చెందిన ఫైర్ ఇంజన్ బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో ఫైరింజన్ అదుపుతప్పి ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫైర్ ఇంజన్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమ్మిత్తం వారందరినీ విశాఖలోని ఐఎన్ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తరలించారు. నెవల్ డక్‌యార్డ్‌కు చెందిన కొందరు ఉద్యోగులు డాల్పిన్ కొండ మీద ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫైర్‌ఇంజన్‌తో నీళ్లు తీసుకెళుతుండగా బ్రేకులు ఫెయిలయ్యి ఈ ప్రమాదం సంబవించినట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. కాగా, గతంలో కూడా అనకాపల్లికి చెందిన రెండు స్కూల్ బస్సులు ఇక్కడే ప్రమాదానికి గురయ్యాయి. ఆ ఘటనలో 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులు రోజు యారాడ నుంచి సిందియా వరకు 8 ట్రిప్పుల మేర తిరుగుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రక్షణ గోడ ఏర్పాటు చేయాలని అక్కడి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
విశాఖ యారాడ కొండపై ప్రమాదం
సాక్షి, విశాఖ : విశాఖ యారాడ కొండపై శనివారం ఓ ప్రయివేట్ స్కూలు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదవశాత్తూ మూడు స్కూల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం అగనంపూడి ఆస్పత్రికి తరలించారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా నగరానికి చెందిన ఓ ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా వెళుతున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒకే స్కూల్‌కు చెందిన మూడు బస్సులు ఢీ
-
కమాండర్ మృతి.. గోప్యంగా ఉంచిన అధికారులు
విశాఖపట్నం: నగరంలోని యరాడ ఘాట్‌రోడ్డులో జరిగిన ఓ రోడ్డుప్రమాదం వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నేవీ అధికారులు సిబ్బంది కారు అదుపుతప్పి యరాడ్ ఘాట్‌రోడ్డులో ఓ కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నేవీ కమాండర్ అవినాష్ ఠాకూర్ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ప్రమాదాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.