విశాఖ యారాడ కొండపై శనివారం ఓ ప్రయివేట్ స్కూలు బస్సులు ప‍్రమాదానికి గురయ్యాయి. ప్రమాదవశాత్తూ మూడు స్కూల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం అగనంపూడి ఆస్పత్రికి తరలించారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా నగరానికి చెందిన ఓ ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా వెళుతున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒకే స్కూల్‌కు చెందిన మూడు బస్సులు ఢీ
Published Sat, Dec 9 2017 6:36 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement