రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్తా ప్లాస్టిక్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున మొదలైన మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. పెద్దమొత్తంలో ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.