ముంబై (మహారాష్ట్ర): షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగిన ఘటన ముంబైలోని పశ్చిమ బోరివాలిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో 14 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం ఏమైనా జరిగాయా అన్నదానిపై వివరాలు ఇంకా తెలియరాలేదు. గత నెలలోనూ దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, కువైట్ కార్యకలాపాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రాఫోర్డ్ మార్కెట్‌లోని పలు దుకాణాల్లో కూడా మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే.
Maharashtra: A level 4 fire broke out at a shopping centre in Borivali West of Mumbai earlier this morning; 14 fire engines and Police are at the spot. Fire fighting operations are still underway. pic.twitter.com/tRAXr8guSt
— ANI (@ANI) July 11, 2020
Comments
Please login to add a commentAdd a comment