ఏవీఎమ్ స్టూడియోలో గోడ కూలి శనివారం రాత్రి ఒకరు మృతిచెందారు.
చెన్నై: ఏవీఎమ్ స్టూడియోలో గోడ కూలి శనివారం రాత్రి ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని శిధిలాలను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.