AVM studio
-
ఆ ఓటీటీలోకి ‘తమిళ రాకర్స్’.. ఎప్పుడంటే..
ఏవీఎం ప్రొడక్షన్స్. ఈ పేరు విజయాలకు చిరునామా. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, రజినీకాంత్, కమలహాసన్ వంటి గొప్ప నటులందరూ ఈ సంస్థలో నటించిన వారే. అలాంటి సంస్థ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఈ సంస్థ మళ్లీ చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. ఏవీ మెయ్యప్పన్ కుటుంబం నుంచి 4వ తరం చెందిన అరుణ గుహన్ తాజాగా చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముందుగా తమిళ రాకర్స్ పేరుతో వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. అరివళగన్ దర్శకత్వం వహించిన ఎనిమిది భాగాలతో ఈ వెబ్‌సిరీస్‌లో నటుడు అరుణ్ విజయ్, నటి ఐశ్వర్య మీనన్, వాణిభోజన్ హీరో హీరోయిన్లుగా నటించారు. సోనీ లివ్ సంస్థ భాగస్వామ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. నూతన చిత్రాలను పైరసీ చేస్తూ నిర్మాతల ఆదాయానికి గండి కొడుతున్న తమిళరాకర్స్ నేపథ్యంలో రూపొందించిన వెబ్‌సిరీస్ ఇదని దర్శకుడు అరివళగన్ తెలిపారు. ఇందులో అరుణ్ విజయ్ పోలీసు అధికారిగాను, ఆయనకు జంటగా ఐశ్వర్య మీనన్, సహ పోలీసు అధికారిణిగా వాణి భోజన్ నటించారని తెలిపారు. ఇందులో రొమాన్స్ సన్నివేశాలు పరిధికి మించకుండా ఉంటాయన్నారు. నటుడు అరుణ్ విజయ్ మాట్లాడుతూ అరివళగన్ దర్శకత్వంలో ఇంతకుముందు రెండు చిత్రాలలో నటించానన్నారు. తాను నటించిన తొలి వెబ్‌సిరీస్ ఇదేనన్నారు. వెబ్ సిరీస్ ద్వారా విషయాన్ని మరింత విఫులంగా చెప్పే వీలు ఉంటుందని పేర్కొన్నారు. అరుణ గుహన్ మాట్లాడుతూ కథ నచ్చడంతో ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. త్వరలోనే భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె వెల్లడించారు. -
ఏవీయం రాజేశ్వరికి లాక్
చెన్నైలోని వడపళని ఏరియాలో గల ఏవీయం రాజేశ్వరి థియేటర్లో సినిమా చూసినవాళ్లకు ఓ చేదు వార్త. ఈ స్టూడియోకి లాక్ పడబోతోంది. ఎంజీఆర్, శివాజీ గణేశన్.. ఆ తర్వాత శివకుమార్, జయశంకర్, ఆ తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్, ఆ తర్వాత కార్తీక్, శివాజీ తనయుడు ప్రభు నుంచి ఆ తర్వాతి తరం శివకుమార్ తనయుడు సూర్య, అజిత్... ఇలా మూడు నాలుగు తరాల హీరోలతో పాటు నాలుగు తరాల హీరోయిన్లనూ చూపించిన ఈ తెరకు తెరపడనుండటం అంటే చిన్న విషయం కాదు. దివంగత లెజెండ్రీ ప్రొడ్యూసర్, ఏవీయం స్టూడియోస్ ఫౌండర్ ఏవీ మెయ్యప్ప చెట్టియార్ (ఏవీయం చెట్టియార్) తన సతీమణి ఏవీయం రాజేశ్వరి పేరు మీద ఈ థియేటర్ కట్టించారు. 1979లో ఆరంభమైన ఈ థియేటర్ నిరాటంకంగా సినిమాలు ప్రదర్శిస్తూ వచ్చింది. చెట్టియార్ మరణం తర్వాత ఆయన వారసులు థియేటర్ నిర్వహణను చూసుకుంటున్నారు. ఇప్పుడు కోవిడ్ 19 కారణంగా థియేటర్లు మూతబడిన నేపథ్యంలో థియేటర్ల యజమాన్యానికి నష్టం వాటిల్లింది. మళ్లీ థియేటర్లు ఓపెన్ చేశాక ప్రేక్షకులు వస్తారా? అనే సందేహం కూడా ఉంది. అందుకే ‘ఏవీయం రాజేశ్వరి’ థియేటర్ని పర్మినెంట్‌గా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించుకుందట. తక్కువ ధరకు టికెట్స్, మినిమమ్ పార్కింగ్ చార్జీలు, థియేటర్ ఫుడ్ స్టాల్స్‌లో తక్కువ ధరకే తినుబండారాలు.. ఇలా ఆడియన్స్ ఫ్రెండ్లీ థియేటర్‌గా ఏవీయంకి పేరుంది. అలాగే చెన్నై వాషర్‌మేన్‌పేట్‌లో గల మహారాణి థియేటర్ కూడా మూతపడనుందట. మరి.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో మరెన్ని థియేటర్లు మూతబడతాయో చూడాలి. -
నాయకి నా కెరీర్లో కీలకం
నాయకి చిత్రం నా కెరీర్లో కీలకం అవుతుందనే నమ్మకాన్ని నటి త్రిష వ్యక్తం చేశారు. ఈమె తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నాయకి ఆమె పీఏ గిరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. నవ దర్శకుడు గోవి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్కె సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, మనోబాలా, కోవై సరళ, సత్యన్రాజేష్ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ తనకు పీఏ గాను నాయకి చిత్రానికి నిర్మాతగాను గిరిధర్ చాలా కష్టమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారన్నారు. గత ఆరేళ్లుగా ఆయన తనకు పీఏగా పనిచేస్తున్నారని మూడేళ్ల క్రితం ఈ చిత్రం గురించి తనకు చెప్పారని అన్నారు. దర్శకుడు గోవి ఒక గంటలో నాయకి చిత్ర కథ గురించి చెప్పారన్నారు. ఆయన నెరేట్ చేసిన విధమే తనకు బాగా నచ్చిందన్నారు. ఇది హార్రర్ కామెడీ కథా చిత్రం అని తెలిపారు. పూర్తి హార్రర్ కథా చిత్రం చేయాలన్న ఆకాంక్ష చాలా కాలంగా ఉందన్నారు. అరణ్మణై -2 చిత్రం చేస్తున్నదానికి ఈ చిత్రానికి ఎలాంటి పోలికలు ఉండవన్నారు. ఇది 1980లో జరిగే కథా చిత్రం అని చెప్పారు. ఇందులో దెయ్యం హత్యలు చేస్తుందా? లేక వ్యక్తి పగ, ప్రతీకార ఇతివృత్తమా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు. తానిప్పటి వరకు చాలా చిత్రాలు చేశానని వాటికి భిన్నంగా చేయాలన్న భావనే ఈ నాయకి చిత్ర తెరరూపానికి కారణం అని అన్నారు. నటి నయనతార మాయ అనే హార్రర్ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఆమెకు పోటీగా మీరీ చిత్రంలో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు తానెవరితో పోటీ పడనని నయనతార నటిస్తున్న మాయ చిత్ర కథ వేరు తాను చిత్ర కథ వేరని ఈ సందర్భంగా అన్నారు. గాయని అవతారం : కాగా నటి త్రిష ఈ చిత్రం ద్వారా గాయనిగా కూడా అవతారమెత్తనుండడం విశేషం. చిత్ర సంగీత దర్శకుడు రఘుకుంచె త్రిషతో ప్రమోషన్ సాంగ్‌ను పాడించనున్నారట. దీని గురించి త్రిష వెల్లడిస్తూ రఘు కంచె పాడమని కోరడంతో సరే నన్నానని అయితే ఇంటర్వ్యూలో రెండు లైన్లు పాడడానికే చెమటలు పట్టేశాయని అలాంటిది ఈ చిత్రంలో ఎలా పాడుతానో అన్న చిన్న సంకోచం లేకపోలేదని ఆమె అన్నారు. గాయనిగా కొనసాగుతానా అన్నది ఈ చిత్రంలో పాటకు స్పందనను బట్టి ఉంటుందని ఈ చెన్నై చిన్నది త్రిష అన్నారు. -
ఏవీఎమ్ స్టూడియో గోడ కూలి ఒకరి మృతి
చెన్నై: ఏవీఎమ్ స్టూడియోలో గోడ కూలి శనివారం రాత్రి ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని శిధిలాలను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వెలుగులు చిమ్మిన వీధులు...నేడు ఖాళీ