మోదీ హత్యకు సిమి కుట్ర? | SIMI had planned to kill Narendra Modi in Ambikapur | Sakshi
Sakshi News home page

మోదీ హత్యకు సిమి కుట్ర?

Published Sat, Apr 11 2015 2:11 PM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

మోదీ హత్యకు సిమి కుట్ర?

మోదీ హత్యకు సిమి కుట్ర?

రాయ్పూర్ : చత్తీస్ఘడ్ పోలీసుల విచారణలో ప్రధాని నరేంద్ర మోదీపై హత్యా ప్రయత్నానికి సంబంధించిన మరో్ షాకింగ్ న్యూస్ వెలుగులోకి  వచ్చింది.   స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాది గుర్ఫాన్ వెల్లడిస్తున్న విషయాలు  పోలీస్ వర్గాల్లో కలకలం   రేపుతున్నాయి.   ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేసేందుకు సిమి ప్లాన్ చేసి విఫలమైనట్లు తెలుస్తోంది. అంబికాపూర్ లోక్సభ ఎన్నికల  ప్రచార  ర్యాలీలో మోదీని హత్యచేసేందుకు ప్లాన్ చేసి, కొన్ని అనివార్య కారణాల వల్ల తన పథకాలను అమలు చేయలేకపోయినట్టుగా  గుర్ఫాన్  పోలీస్ విచారణలో అంగీకరించినట్టుగా తెలుస్తోంది.      


రాష్ట్ర ఐజీ జేపీసింగ్ సమాచారం ప్రకారం  ..జార్ఖండ్ పేలుళ్ళ సంఘటన తరువాత రాయ్పూర్ నుంచి పరారైన గుర్ఫాన్ అరేబియన్ సముద్రానికి సమీపంలో  తలదాచుకున్నాడు.  అక్కడ కొన్నాళ్లు కేర్ టేకర్గా పనిచేశాడు.  అతను దుబాయ్లో ఉన్నపుడు అంతర్జాతీయ ఉగ్రవాది అబూ సలేంతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా మరి కొంతమంది సభ్యులను కలిసినట్టుగా  అంగీకరించాడు. అంతేకాదు గుర్ఫాన్ సిమీ నేతల ఆధ్వర్యంలో నేపాల్లో జరిగిన న్యూ ఇయర్  గ్రాండ్ పార్టీకి కూడా హాజరైనట్టుగా పోలీసులు చెబుతున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేరగాళ్లందరూ  ఈ పార్టీకి హాజరైనా భారతీయనిఘా వ్యవస్థ కనుక్కోలేక పోయిన విషయాన్ని కూడా  గుర్ఫాన్ పోలీసులకు తెలిపినట్టుగా తెలుస్తోంది.

తన సహచరులు ఇజాయిద్దీన్, అస్లాం ను ఇండోర్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన తరువాత స్వయంగా గుర్ఫాన్  రాయ్పూర్ కోర్టులో  లొంగిపోయాడు. అయితు గుర్ఫాన్ పోలీసుల విచారణకుసహకరిస్తున్నప్పటికీ, కీలక సమాచారాన్ని మాత్రం అందించడంలేదని ఐసీ వెల్లడించారు.  జార్ఖండ్ పేలుళ్ల సూత్రధారులను  తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement