రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ లోని బాల్‌రామ్‌పూర్ జిల్లా జోకాపథ్ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సుమారు 70 ఏళ్ల తర్వాత ఆ ఊరికి వెలుగులు వచ్చాయి.
స్వాతంత్ర్యం అనంతరం కూడా కరెంట్ సరఫరా లేని గ్రామాల్లో జోకాపథ్ ఒకటి. చుట్టూ కొండలు, అటవీ ప్రాంతంలో రవాణా సదుపాయం కూడా కష్టతరంగా ఉండే గ్రామం అది. అయితే జన్‌పథ్ సీఈవో ఎంఎస్ మార్కం, కలగజేసుకోవటంతో ఈ గ్రామానికి ఇప్పుడు విద్యుత్ ప్రసారం మొదలైంది. కరెంట్ రావటంతో తామంతా సంతోషంగా ఉన్నామని.. తమ పిల్లలు చదువుల కోసం ఏర్పడ్డ అడ్డంకులు తొలగిపోయాయని గ్రామ సర్పంచ్ చెబుతున్నారు.
దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న నేతలు ఇన్నాళ్లూ ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని పలువురు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అధికారుల చొరవతో ఇప్పుడు అది నెరవేరిందని... స్థోమత కలిగిన వాళ్లు సోలార్ విద్యుత్, జనరేటర్లతో నెట్టుకొచ్చారని వారంటున్నారు. ఇంతకాలం అవస్థలు పడ్డ ఆ గ్రామస్థులు ఇంట్లో వెలుగులు నిండటంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
Jokapath village in Balrampur district of #Chhattisgarh gets electricity connections for the first time since independence pic.twitter.com/Gkl2uJaGv1
— ANI (@ANI) December 17, 2017
Comments
Please login to add a commentAdd a comment