remote village
-
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకి ఆ గ్రామానికి ‘కరెంట్’ కనెక్షన్
శ్రీనగర్: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్నా ఇంకా చాలా గ్రామాలు కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మారుమూల ప్రాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే కోవకు చెందుతుంది జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా డూరు బ్లాక్ పరిధిలోని టెథాన్ గ్రామం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంలో భాగంగా ఆ ఊరికి విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేశారు అధికారులు. అనంతనాగ్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి 75 ఏళ్ల తర్వాత కరెంట్ సరఫరా జరుగుతోంది. అనంతనాగ్ కొండ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామం టెథాన్‌లో సుమారు 200 మంది ప్రజలు నివసిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం డెవలప్మెంట్ ప్యాకేజీ స్కీమ్‌లో విద్యుత్తు సరఫరాను అందించారు అధికారులు. గ్రామంలో 75 ఏళ్ల తర్వాత తొలి విద్యుత్తు దీపం వెలిగింది. తమ ఇళ్లల్లో విద్యుత్తు కాంతులు చూసి అక్కడి ప్రజలు మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు తమ అవసరాల కోసం సాంప్రదాయ కలప, దీపాలను వాడేవారు. ‘ఈరోజు తొలిసారి విద్యుత్తు కాంతులను చూస్తున్నాం. ఇకపై మా పిల్లలు విద్యుత్తు దీపాల కింద చదువుకుంటారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. కరెంట్ లేకపోవడంతో చాలా కష్టాలు పడ్డాము. ఇప్పటి వరకు మా అవసరాల కోసం సంప్రదాయ కలపను ఉపయోగించాం. ఇప్పుడు మా సమస్యలకు ఓ పరిష్కారం లభించింది. ప్రభుత్వానికి, విద్యుత్తు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.’ అని ఫాజుల్ ఉదిన్ ఖాన్ అనే గ్రామస్థుడు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో విద్యుత్తు కాంతులను చూసి నృత్యాలు చేస్తున్నారని చెప్పారు. ఇదీ చదవండి: ‘కశ్మీర్లో భాగం కావడమే మంచిది’.. విలీనానికే లద్దాఖ్ నేతల మొగ్గు! -
ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి
ఎనిమిది కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కిదిగితే గానీ ఆ గ్రామానికి చేరుకోలేం. గుక్కెడు నీటికోసం పిల్లాజెల్లా అంతా కలిసి బిందెలు ఎత్తుకుని పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఊరు విడిచిపోతేగానీ పెద్ద చదువులకు అవకాశం లేదు. అటవీ ప్రాంతంలో కష్టాలతో సహవాసం చేస్తున్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భీమనగొంది గ్రామస్తుల వ్యథ ఇది. సిర్పూర్(యూ): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భీమనగొంది ఉంది. ఇక్కడ 31 ఆదివాసీ కుటుంబాలకు చెందిన 150 మందికిపైగా జీవిస్తున్నారు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే చోర్పల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో కొండల మధ్య ప్రయాణించాల్సిందే. అదీ ఎగుడు దిగుడుగా ఉండే అధ్వానపు రహదారి మీద స్థానికంగా రేషన్ దుకాణం లేకపోవడంతో చోర్‌పల్లికి కాలినడకన వెళ్లి.. 20, 30 కిలోల బియ్యం మూటలు నెత్తిన మోసుకుంటూ తెచ్చుకోవాల్సిందే. గ్రామస్తులు వినియోగిస్తున్న బావి ఇక వానాకాలం వచ్చిందంటే మట్టిరోడ్డు బురదతో నిండి.. కాలు తీసి కాలువేయలేని పరిస్థితి ఉంటుంది. ఎంత అత్యవసరమైనా 108 వాహనం రాదు. ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఎడ్లబండిపై చోర్పల్లి వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో జైనూర్, సిర్పూర్(యూ) మండల కేంద్రాలకు చేరుకుంటారు. నీళ్లకు నిండా గోస.. గ్రామంలో రెండేళ్ల క్రితం భగీరథ ట్యాంకు నిర్మించారు. కానీ ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ట్యాంకును సైతం 20 రోజులకోసారి నింపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఊరి చివరన నిర్మించుకున్న బావి నుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. బావి ప్రహరీ సగం వరకు కూలిపోయి శిథిలావస్థకు చేరుకుంది. భీమనగొంది గ్రామ రహదారి అదికూడా ఈ బావి వాగులో ఉండటంతో వానాకాలంలో చెత్తాచెదారంతో నిండిపోతుంది. గ్రామానికి చెందిన వృద్ధులు వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పింఛన్ వస్తలేదు నాకు అరవై ఏళ్లు దాటినా ఇప్పటివరకు పింఛన్ వస్తలేదు. నాకు ఏ పని చేతకాదు. సర్కారు పింఛన్ అందిస్తే బతుకుతా. – ఆత్రం బాగుబాయి, గ్రామస్తురాలు రోడ్డు, నీటి సమస్య పరిష్కరించాలి మా గ్రామానికి రోడ్డు పెద్ద సమ స్య. ఊరి నుంచి పంచాయతీకి వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిందే. రోడ్డు, నీటి సమ స్య పరిష్కరిస్తే గ్రామం బాగు పడుతుంది. – మర్సుకోల సోనేరావు, గ్రామస్తుడు -
టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!
Grand Canyon Supai Village Interesting Facts In Telugu: అభివృద్ధి, టెక్నాలజీ గురించి ఒక నిముషం మాట్లాడమంటే మదిలో మొదటమెదిలే దేశం అమెరికా. ఎత్తైన భవనాలు, సైంటిఫిక్ కల్చరల్ లైఫ్, కొత్త కొత్త టెక్నాలజీలతో దూసుకుపోయే ప్రపంచం అక్కడి ప్రజలది. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధికి మారుపేరు అమెరికా. ప్రతి ఒక్కరూ అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటారనడంతో సందేహంలేదు. ఇతంటి ఘన చరిత్ర ఉన్న అమెరికాలోకూడా వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయా.. అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అవును.. అసలు అభివృద్ధి అంటే ఏమిటో కూడా తెలియని ఓ గ్రామం ఉంది. ఏంటీ.. అమెరికాలో గ్రామాలా? అదీ అభివృద్ధేలేని గ్రామం.. అస్సలు నమ్మం..! అనుకుంటున్నారా? ఐతే ఇది చదవండి. 3 వేల అడుగుల లోతులో ఆ గ్రామం.. గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయ అమెరికాలో చాలా ఫేమస్. ప్రతీ ఏట దాదాపుగా 55 లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు కూడా. దీనికి సమీపంలోనే సుపాయ్ అనే గ్రామం ఉంది. అతిలోతైన భూగర్భ గ్రామంగా ఇది ప్రసిద్ధి. ఎందుకంటే అమెరికా భూమట్టానికి దాదాపుగా మూడు వేల అడుగుల లోతులో ఉందీ గ్రామం. ఇక్కడ దాదాపు 208 మంది అమెరికన్ స్థానికులు నివసిస్తున్నారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ఈ రోజుకీ గాడిదలపైనే ప్రయాణం.. ఈ గ్రామస్తులు ఎంత వెనుకబడి ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఇక్కడి ప్రజలు పూర్తిగా విభిన్న ప్రపంచంలో నివసిస్తున్నారు. వీరికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. సుపాయ్ గ్రామస్థులు హవాసుపాయి భాషను మాట్లాడుతారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాటిని అనుసరిస్తారట. ఈ గ్రామంలో ప్రయాణించడానికి రైలు లేదు. కనీసం సరైన రోడ్డు కూడా లేదు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే కాలి కాలినడకన వెళ్లాల్సిందే!! లేదంటే గాడిదలపై రావాలి. అంతేకాకుండా 1, 2 గుర్రాలు కూడా ప్రయాణాలకు వినియోగిస్తారట. వీటిద్వారానే సమీపంలో ఉన్న హైవేకి వెళ్తుంటారు. ఈ గ్రామానికి, సిటీని కలిపే ఖచ్చితమైన మార్గం కూడా ఏదీ లేదు. కేవలం గుర్రాలు, గాడిదలపైనే సిటీలకు ప్రయాణిస్తుంటారు అక్కడి స్థానికులు. వెదురుతో బుట్టలను అల్లి.. నగరానికి వెళ్లి.. టెక్నాలజీకి పూర్తిగా దూరంగా ఉందీ గ్రామం. ఐతే ఇక్కడ కొన్ని పోస్టాఫీసులు, కేఫ్‌లు, రెండు చర్చిలు, లాడ్జీలు, ప్రాథమిక పాఠశాలలు, కిరాణా దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజల జీవనోపాధి ఏంటంటే.. వెదురుతో బుట్టలను అల్లి సమీపంలోని నగరాల్లో అమ్ముకుని జీవనం సాగించటం. చిక్కుడు, మొక్కజొన్నలను సాగు చేసి పొట్టపోసుకుంటారు. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. ఫోన్ అంటే ఏమిటో కూడా వీళ్లకు తెలియదు! ఇంతగా వెనుక బడిన సుపాయి గ్రామానికి ఉత్తరాలేమైనా వచ్చినా.. అక్కడి ప్రజలకు సమయానికి చేరవు. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఉత్తరాలు అందజేయడానికి కూడా గాడిదలు, గుర్రాలపైనే ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ గ్రామంలో ఫోన్, ఈమెయిల్, ఫ్యాక్స్ సౌకర్యాలు అస్సలుండవు. ఇదంతా చదువుతుంటే.. పాత కాలం నవలలాగా, బ్లాంక్ అండ్ వైటు సినిమాలా అనిపించినా.. నేటికీ సుపాయి గ్రామం పరిస్థితికి అద్దంపట్టే వాస్తవాలివి. అమెరికా లాంటి దేశంలో ఇంత వెనుకబడిన గ్రామం ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ...! అంతేకాదు ఈ ఊరుకి వెళ్లాలంటే దారంతా పొదలతో నిండిన అడవులను దాటుకుంటూ వెళ్లవలసి ఉంటుంది. ప్రతీ ఏట వేలాది మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని చూసేందుకు వెళుతుంటారు. ఐతే ఈ గ్రామంలోకి ప్రవేశించేముందు హవాసుపాయి గిరిజన మండలి అనుమతి తప్పక తీసుకోవాలి. లేదంటే లోపలికి ప్రవేశం లేదు. గ్రామంలో ప్రవేశించిన తర్వాత కూడా వారి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలట. నేటి ఆధునిక యుగంలో అమెరికాలాంటి దేశంలో అభివృద్ధి కన్నే ఎరుగని సుపాయి గ్రామం ఇలా పూర్తిగా వెనుకబడి ఉండటం వెనక కారణం ఏమైఉంటుందో..! చదవండి: అపెండిక్స్‌కు క్యాన్సర్ వస్తుందా! -
శేష జీవితాన్ని ఇలా గడిపేస్తా: రేణుదేశాయ్
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్‌లోని ఓ గ్రామంలో చిన్నపిల్లలతో సరదాగా గడిపిన ఓ వీడియోను నటి రేణుదేశాయ్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చిన్న పిల్లలతో బాబా ఫోజ్ పెట్టిస్తూ ఆనందంగా గడిపారు. ఆవులు, మేకలు, కాకులు, కొంగల వీడియోలను తన ఇన్స్ట్రా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి పల్లె జీవితాన్ని మిస్సవుతున్నానని పేర్కొన్నారు. తన పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత మిగిలిన శేష జీవితాన్ని కూరగాయలు పండిస్తూ మారుమూల గ్రామంలో గడపాలని బలంగా కోరుకుంటున్నానని తెలిపారు. ఓ పది పిల్లులు, 10 శునకాలు, భారీ మొత్తంలో మూగజీవాలు, లెక్కలేనన్ని పుస్తకాలు, ఇవి ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అంటూ పోస్ట్ పెట్టారు. ఆరోజు త్వరలోనే వస్తుందని ఆకాంక్షించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయట తిరగొద్దు అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కి బదులిస్తూ... ఇవి ఇంతకు ముందు తీసిన వీడియోలని క్యాప్షన్ చూసి కామెంట్లు పెట్టాలని రేణుదేశాయ్ చురకలంటించారు. View this post on Instagram . Missing the village life... simple uncomplicated living... I have a sincere strong desire to settle on a farm in a remote village once my kids go to college. Do a little bit of vegetable farming and have 10 cats and 10 dogs and lots of rescue animals and unlimited supply of books. That will truly be heaven for me! One day...one day soon🧡 A post shared by renu desai (@renuudesai) on Mar 27, 2020 at 11:22pm PDT -
70 ఏళ్ల తర్వాత ఆ ఊళ్లో వెలుగులు...
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ లోని బాల్‌రామ్‌పూర్ జిల్లా జోకాపథ్ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సుమారు 70 ఏళ్ల తర్వాత ఆ ఊరికి వెలుగులు వచ్చాయి. స్వాతంత్ర్యం అనంతరం కూడా కరెంట్ సరఫరా లేని గ్రామాల్లో జోకాపథ్ ఒకటి. చుట్టూ కొండలు, అటవీ ప్రాంతంలో రవాణా సదుపాయం కూడా కష్టతరంగా ఉండే గ్రామం అది. అయితే జన్‌పథ్ సీఈవో ఎంఎస్ మార్కం, కలగజేసుకోవటంతో ఈ గ్రామానికి ఇప్పుడు విద్యుత్ ప్రసారం మొదలైంది. కరెంట్ రావటంతో తామంతా సంతోషంగా ఉన్నామని.. తమ పిల్లలు చదువుల కోసం ఏర్పడ్డ అడ్డంకులు తొలగిపోయాయని గ్రామ సర్పంచ్ చెబుతున్నారు. దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న నేతలు ఇన్నాళ్లూ ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని పలువురు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అధికారుల చొరవతో ఇప్పుడు అది నెరవేరిందని... స్థోమత కలిగిన వాళ్లు సోలార్ విద్యుత్, జనరేటర్లతో నెట్టుకొచ్చారని వారంటున్నారు. ఇంతకాలం అవస్థలు పడ్డ ఆ గ్రామస్థులు ఇంట్లో వెలుగులు నిండటంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. Jokapath village in Balrampur district of #Chhattisgarh gets electricity connections for the first time since independence pic.twitter.com/Gkl2uJaGv1 — ANI (@ANI) December 17, 2017 -
69 ఏళ్ల తర్వాత..!
డెహ్రాడూన్: దాదాపు 69 ఏళ్ల తర్వాత ఓ గ్రామ ప్రజల ఆశలు నెరవేరాయి. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోని శిల్పట కుగ్రామానికి మొదటి సారి బస్సు వెళ్లింది. మండల కేంద్రం నుంచి 21 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కోసం గ్రామస్తులు 69 ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఆ ఊరికి రోడ్డు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కాలంలో రోజువారీ వినియోగవస్తువుల కోసం కొన్ని కిలోమీటర్ల మేర కొండల్లో నుంచి నడిచి వెళ్లే వాళ్లమని ఊరిలోని కొంతమంది పెద్దలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గ్రామానికి రోడ్డు వేసి బస్సును నడుపుతారని ఆశగా ఎదురుచూశామని చెప్పారు. వారి జీవితాలు ముగిసిపోయేలోగానైనా ఈ ఆశ నెరవేరినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ బస్సు ఊరికి చేరగానే ఆ గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామానికి రోడ్డు వచ్చేందుకు కృషి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనసూయ ప్రసాద్ మైఖురీకి ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రాజెక్టు పూర్తి కావాల్సివుండగా అనివార్యకారణాలతో ఆగిపోయినట్లు మరి కొందరు గ్రామస్తులు చెప్పారు. రోడ్డు నిర్మాణం కోసం ఎన్నోమార్లు నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహించినట్లు వివరించారు. -
రోడ్డు బాగోలేదని హెలికాప్టర్ తయారు చేసుకున్నాడు
దిస్పూర్: రోడ్డు బాగలేకపోతే సాధారణంగా మనమైతే ఏం చేస్తాం? ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం.. రోడ్డు వేయకుంటే ధర్నా చేస్తాం.. ప్రభుత్వం కూడా రహదారి నిర్మించలేని ప్రాంతమైతే ఏదో ఒకలా ఆ పని పూర్తి చేయండంటూ ప్రాధేయపడుతాం. కానీ, అసోంలో ఓ మెకానిక్ మాత్రం పై వాటిల్లో ఏ పనీ చేయలేదు. తన మేధస్సుకు పదును పెట్టాడు. రహదారి కూడా సరిగా లేని తన గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు ఎలాంటి చిక్కులు లేకుండా వెళ్లేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే తయారు చేసుకున్నాడు. అసోంలోని శ్యాంజులి అనే ఎజెన్సీ గ్రామానికి చెందిన చంద్ర సివోక్తి శర్మ అనే వ్యక్తి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వారిది పేద కుటుంబం. పెద్దగా స్కూల్‌కి కూడా వెళ్లేవాడు కాదు. కానీ, అతడు చేసిన ఆవిష్కరణ ముందు మాత్రం ఎలాంటి డిగ్రీలు, పట్టాలు కూడా సాటిరావని నిరూపించాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కూడా నూతన ఆవిష్కరణలు చేయాలని, వాటికి ప్రతి ఒక్కరు స్వాగతం పలకాలని ప్రతి కార్యక్రమంలో చెప్పిన విషయం తెలిసిందే. అతడు ఈ స్లోగన్‌ను ఆదర్శంగా తీసుకున్నాడో లేక, తన గ్రామ పరిస్థితిని అధిగమించాలనుకున్నాడో.. మొత్తానికి సొంతంగా ఓ హెలికాప్టర్‌ను తయారు చేసుకోవడంతోపాటు దాన్ని గాల్లో కూడా ఎగిరించాడు. దీని నిర్మాణం కోసం అతడు చేసిన ఖర్చు 15లక్షల రూపాయలు. ఈ హెలికాప్టర్ ఇద్దరు వ్యక్తులను 30 నుంచి 50 అడుగుల ఎత్తులో తీసుకెళ్లగలదని చంద్ర మీడియాతో తెలిపాడు.