సుపాయి విలేజ్
Grand Canyon Supai Village Interesting Facts In Telugu: అభివృద్ధి, టెక్నాలజీ గురించి ఒక నిముషం మాట్లాడమంటే మదిలో మొదటమెదిలే దేశం అమెరికా. ఎత్తైన భవనాలు, సైంటిఫిక్ కల్చరల్ లైఫ్, కొత్త కొత్త టెక్నాలజీలతో దూసుకుపోయే ప్రపంచం అక్కడి ప్రజలది. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధికి మారుపేరు అమెరికా. ప్రతి ఒక్కరూ అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటారనడంతో సందేహంలేదు. ఇతంటి ఘన చరిత్ర ఉన్న అమెరికాలోకూడా వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయా.. అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అవును.. అసలు అభివృద్ధి అంటే ఏమిటో కూడా తెలియని ఓ గ్రామం ఉంది. ఏంటీ.. అమెరికాలో గ్రామాలా? అదీ అభివృద్ధేలేని గ్రామం.. అస్సలు నమ్మం..! అనుకుంటున్నారా? ఐతే ఇది చదవండి.
3 వేల అడుగుల లోతులో ఆ గ్రామం..
గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయ అమెరికాలో చాలా ఫేమస్. ప్రతీ ఏట దాదాపుగా 55 లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు కూడా. దీనికి సమీపంలోనే సుపాయ్ అనే గ్రామం ఉంది. అతిలోతైన భూగర్భ గ్రామంగా ఇది ప్రసిద్ధి. ఎందుకంటే అమెరికా భూమట్టానికి దాదాపుగా మూడు వేల అడుగుల లోతులో ఉందీ గ్రామం. ఇక్కడ దాదాపు 208 మంది అమెరికన్ స్థానికులు నివసిస్తున్నారు.
చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!
ఈ రోజుకీ గాడిదలపైనే ప్రయాణం..
ఈ గ్రామస్తులు ఎంత వెనుకబడి ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఇక్కడి ప్రజలు పూర్తిగా విభిన్న ప్రపంచంలో నివసిస్తున్నారు. వీరికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. సుపాయ్ గ్రామస్థులు హవాసుపాయి భాషను మాట్లాడుతారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాటిని అనుసరిస్తారట. ఈ గ్రామంలో ప్రయాణించడానికి రైలు లేదు. కనీసం సరైన రోడ్డు కూడా లేదు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే కాలి కాలినడకన వెళ్లాల్సిందే!! లేదంటే గాడిదలపై రావాలి. అంతేకాకుండా 1, 2 గుర్రాలు కూడా ప్రయాణాలకు వినియోగిస్తారట. వీటిద్వారానే సమీపంలో ఉన్న హైవేకి వెళ్తుంటారు. ఈ గ్రామానికి, సిటీని కలిపే ఖచ్చితమైన మార్గం కూడా ఏదీ లేదు. కేవలం గుర్రాలు, గాడిదలపైనే సిటీలకు ప్రయాణిస్తుంటారు అక్కడి స్థానికులు.
వెదురుతో బుట్టలను అల్లి.. నగరానికి వెళ్లి..
టెక్నాలజీకి పూర్తిగా దూరంగా ఉందీ గ్రామం. ఐతే ఇక్కడ కొన్ని పోస్టాఫీసులు, కేఫ్‌లు, రెండు చర్చిలు, లాడ్జీలు, ప్రాథమిక పాఠశాలలు, కిరాణా దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజల జీవనోపాధి ఏంటంటే.. వెదురుతో బుట్టలను అల్లి సమీపంలోని నగరాల్లో అమ్ముకుని జీవనం సాగించటం. చిక్కుడు, మొక్కజొన్నలను సాగు చేసి పొట్టపోసుకుంటారు.
చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే..
ఫోన్ అంటే ఏమిటో కూడా వీళ్లకు తెలియదు!
ఇంతగా వెనుక బడిన సుపాయి గ్రామానికి ఉత్తరాలేమైనా వచ్చినా.. అక్కడి ప్రజలకు సమయానికి చేరవు. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఉత్తరాలు అందజేయడానికి కూడా గాడిదలు, గుర్రాలపైనే ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ గ్రామంలో ఫోన్, ఈమెయిల్, ఫ్యాక్స్ సౌకర్యాలు అస్సలుండవు.
ఇదంతా చదువుతుంటే.. పాత కాలం నవలలాగా, బ్లాంక్ అండ్ వైటు సినిమాలా అనిపించినా.. నేటికీ సుపాయి గ్రామం పరిస్థితికి అద్దంపట్టే వాస్తవాలివి. అమెరికా లాంటి దేశంలో ఇంత వెనుకబడిన గ్రామం ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ...! అంతేకాదు ఈ ఊరుకి వెళ్లాలంటే దారంతా పొదలతో నిండిన అడవులను దాటుకుంటూ వెళ్లవలసి ఉంటుంది.
ప్రతీ ఏట వేలాది మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని చూసేందుకు వెళుతుంటారు. ఐతే ఈ గ్రామంలోకి ప్రవేశించేముందు హవాసుపాయి గిరిజన మండలి అనుమతి తప్పక తీసుకోవాలి. లేదంటే లోపలికి ప్రవేశం లేదు. గ్రామంలో ప్రవేశించిన తర్వాత కూడా వారి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలట.
నేటి ఆధునిక యుగంలో అమెరికాలాంటి దేశంలో అభివృద్ధి కన్నే ఎరుగని సుపాయి గ్రామం ఇలా పూర్తిగా వెనుకబడి ఉండటం వెనక కారణం ఏమైఉంటుందో..!
Comments
Please login to add a commentAdd a comment