ఈ ఆవు ‘ఐదో కాలు’ను తాకే అవకాశం వస్తే చాలన్నట్టుగా ఉన్నారు. ఈ కథేంటంటే... ఆవు పేరు రాజు.
చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ ఆవును చాలా మంది ప్రత్యక్ష దైవంగా చూస్తున్నారు. ప్రత్యేకించి మగసంతానాన్ని కోరుకొనే తల్లులు అయితే ఈ ఆవు ‘ఐదో కాలు’ను తాకే అవకాశం వస్తే చాలన్నట్టుగా ఉన్నారు. ఈ కథేంటంటే... ఆవు పేరు రాజు. చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో రాజ్ ప్రతాప్ అనే వ్యక్తి ఈ గోమాతను సంరక్షిస్తున్నాడు.
మూపురానికి కాలు ఉన్న ఈ ఆవుకు చాలా ప్రత్యేకత ఉందట! గర్భవతులు ఈ ఆవు పాదాన్ని తాకితే వారికి మగబిడ్డ పుడుతున్నాడట. స్థానికంగా ఇప్పటి వరకూ అనేక మంది గర్భవతులు ఈ ఆవు ఆశీర్వాదంతో మగబిడ్డను సంతానంగా పొందారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆవు యజమాని దీని ఐదోకాలిని తాకాలనుకొనే వారి సెంటిమెంటును క్యాష్ చేసుకొంటున్నాడు.
ముందు తనకు రూ.500 చెల్లించి, ఆ తర్వాత మూపురం వద్ద ఉన్న కాలును తాకాలని అంటున్నాడు. అయినప్పటికీ ఆవుకున్న మహిమను మనస్పూర్తిగా నమ్ముతున్న మనుషులకు ఈ మొత్తం పెద్ద విషయంగా కనిపించడం లేదు.