
రాయ్‌పూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధపడే క్రమంలో బీజేపీ పరివర్తన్ మహాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పరివర్తన్ సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యక్రమం ముగింపు సభకు ప్రధాని కానున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో. రెండు పరివర్తన యాత్రల ముగింపు సందర్బంగా బిలాస్‌పూర్ సైన్స్ కాలేజీ వేదికగా జరుగనున్న సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నట్లు తెలిపారు.
అప్పుడు ఘోర పరాజయం..
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని తిరిగి చేజికించుకోవాలన్న తాపత్రయంతో ఉంది బీజేపీ. ఆ రాష్ట్రంలో రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా పరిపాలన కొనసాగించిన బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం 15 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 71కి పెరిగింది.
పరివర్తన్ యాత్ర..
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ బీజేపీ పరివర్తన్ మహా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రెండు పరివర్తన యాత్రలను ముగించుకున్న బీజేపీ ముగింపు సభను బిలాస్‌పూర్‌లో జరుపుకోనుంది. 3000 కిమీ మేర సాగిన మొదటి రెండు విడతల యాత్రలో మొత్తం 87 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. నక్సల్ ప్రభావిత అసెంబ్లీ స్థానాలను మినహాయించి అన్ని నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించాలన్నది బీజేపీ ప్రణాళిక.
కాంగ్రెస్ పని అయిపొయింది..
ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో మాట్లాడుతూ.. ఈసారి ఛత్తీస్‌గఢ్‌లో ఎగరబోయేది బీజేపీ జెండానే అని ఈరోజు బిలాస్‌పూర్‌లో జరగబోయే ప్రధాని సభతో ఆ విష్యం తేటతెల్లమవుతుంది అన్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో మొదలై దిగ్విజయంగా సాగిన రెండు యాత్రల్లోనూ దాదాపు 50 లక్షల మంది జనం హాజరయ్యారని ఈరోజు సభకు కూడా అదే స్థాయిలో జనం వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన పరివర్తన్ సంకల్ప యాత్రలను చూసి కాంగ్రెస్ సగం కుంగిపోయిందని వారిలో అప్పుడే ఓటమి భయం మొదలైందని అన్నారు.
భారీ భద్రత..
ఇదిలా ఉండగా బిలాస్‌పూర్‌లోని ప్రధాని సభకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు ఛత్తీస్‌గఢ్ పోలీసులు. సభాప్రాంగణానికి చుట్టూ మూడు కిలోమీటర్ల వ్యాసార్ధాన్ని నో ఫలియింగ్ జోన్‌గా ప్రకటించారు. 1500 మంజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపును రంగంలోకి దించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
जोहार मोदी जी।🙏
— Arun Sao (@ArunSao3) September 30, 2023
मां भारती की सेवा में हर पल समर्पित,गरीबों, पिछड़ों,वंचितों के मसीहा,विश्व के सबसे लोकप्रिय राजनेता एवं देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी का छत्तीसगढ़ की न्यायधानी बिलासपुर में हार्दिक स्वागत एवं अभिनंदन।#CGWelcomesModiJi
जय छत्तीसगढ़।🚩 pic.twitter.com/BKkLBAxxIB
ఇది కూడా చదవండి: వందే భారత్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్
Comments
Please login to add a commentAdd a comment