Parivartan Rally
-
Narendra Modi: బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు
జంషెడ్పూర్: జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వెల్లువలా వచి్చపడుతున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్రమ వలసల వల్ల సంథాల్ పరగణాలు, కోల్హాన్ ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో వేగంగా మార్పులొస్తున్నాయి. స్థానికులు మైనారీ్టలుగా మారిపోయే ప్రమాదముంది. స్థానికేతరుల ఆధిపత్యం వల్ల గిరిజన జనాభా క్రమంగా తగ్గిపోతోంది. అక్రమ వలసదారులు పంచాయతీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమకు భద్రత లేదని జార్ఖండ్‌లో ప్రజలు భావిస్తున్నారు’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం జంషెడ్‌పూర్‌లో ‘పరివర్తన్ మహార్యాలీ’లో మోదీ ప్రసంగించారు. విదేశాల నుంచి అక్రమంగా వలస వచి్చన వారికి జేఎంఎం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీపై అక్రమ వలసదారులు పట్టు బిగించారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లపై దర్యాప్తు కోసం స్వతంత్ర కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జనమే బుద్ధి చెబుతారు జార్ఖండ్‌కు జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసే అతిపెద్ద శత్రువులని మోదీ అన్నారు. అధికార దాహంతో అవి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్నాయని ఆక్షేపించారు. ‘‘గిరిజనుల ఓట్లతో అధికారం దక్కించుకున్న జేఎంఎం ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్న శక్తులతో చేతులు కలిపింది. రాజకీయ స్వార్థం కోసం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను బలి పెడుతోంది. గిరిజన సీఎం చంపయ్ సోరెన్‌ను అన్యాయంగా పదవి నుంచి తప్పించి ఘోరంగా అవమానించారు. జార్ఖండ్‌లో గిరిజనులకు జరుగుతున్న ద్రోహానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. సీఎం హేమంత్ సోరెన్ తన వదిన సీతా సోరెన్‌కే తగిన గౌరవమివ్వడం లేదు. జేఎంఎంకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అన్నారు. మతం పేరిట జేఎంఎం కూటమి ఓటు బ్యాంకును పెంచుకోజూస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముప్పు తప్పాలంటే బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఐదేళ్లపాటు జరిగిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు విపక్షాలు పెద్ద కుట్ర పన్నాయని ఆరోపించారు. జార్ఖండ్ సంక్షేమానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జి) కింద జార్ఖండ్‌లో 32 వేల మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా మోదీ వర్చువల్‌గా అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గృహాలు పొందిన మరో 46 వేల మందికి తాళాలు అందజేశారు. జార్ఖండ్‌లో రూ.660 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.నేడే వందేమెట్రోకు పచ్చజెండారాంచీ: మెట్రో నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాల కోసం దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలను మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇది గుజరా త్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు 359 కి.మీ. దూరాన్ని కేవలం 5.45 గంటల్లో చేరనుంది. ఆరు వందే భారత్ రైళ్లను మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవి టాటానగర్–పట్నా, బ్రహ్మపూర్–టాటానగర్, రుర్కెలా–హౌరా, దేవ్‌గఢ్–వారణాసి, భాగల్పూర్–హౌరా, గయా–హౌరా మార్గాల్లో ప్రయాణిస్తాయి. -
ఛత్తీస్‌గఢ్ పరివర్తన్ యాత్ర ముగింపు సభకు ప్రధాని
రాయ్‌పూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధపడే క్రమంలో బీజేపీ పరివర్తన్ మహాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పరివర్తన్ సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యక్రమం ముగింపు సభకు ప్రధాని కానున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో. రెండు పరివర్తన యాత్రల ముగింపు సందర్బంగా బిలాస్పూర్ సైన్స్ కాలేజీ వేదికగా జరుగనున్న సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నట్లు తెలిపారు. అప్పుడు ఘోర పరాజయం.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని తిరిగి చేజికించుకోవాలన్న తాపత్రయంతో ఉంది బీజేపీ. ఆ రాష్ట్రంలో రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా పరిపాలన కొనసాగించిన బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం 15 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 71కి పెరిగింది. పరివర్తన్ యాత్ర.. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ బీజేపీ పరివర్తన్ మహా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రెండు పరివర్తన యాత్రలను ముగించుకున్న బీజేపీ ముగింపు సభను బిలాస్పూర్లో జరుపుకోనుంది. 3000 కిమీ మేర సాగిన మొదటి రెండు విడతల యాత్రలో మొత్తం 87 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. నక్సల్ ప్రభావిత అసెంబ్లీ స్థానాలను మినహాయించి అన్ని నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించాలన్నది బీజేపీ ప్రణాళిక. కాంగ్రెస్ పని అయిపొయింది.. ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో మాట్లాడుతూ.. ఈసారి ఛత్తీస్‌గఢ్‌లో ఎగరబోయేది బీజేపీ జెండానే అని ఈరోజు బిలాస్పూర్లో జరగబోయే ప్రధాని సభతో ఆ విష్యం తేటతెల్లమవుతుంది అన్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో మొదలై దిగ్విజయంగా సాగిన రెండు యాత్రల్లోనూ దాదాపు 50 లక్షల మంది జనం హాజరయ్యారని ఈరోజు సభకు కూడా అదే స్థాయిలో జనం వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన పరివర్తన్ సంకల్ప యాత్రలను చూసి కాంగ్రెస్ సగం కుంగిపోయిందని వారిలో అప్పుడే ఓటమి భయం మొదలైందని అన్నారు. భారీ భద్రత.. ఇదిలా ఉండగా బిలాస్‌పూర్‌లోని ప్రధాని సభకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు ఛత్తీస్‌గఢ్ పోలీసులు. సభాప్రాంగణానికి చుట్టూ మూడు కిలోమీటర్ల వ్యాసార్ధాన్ని నో ఫలియింగ్ జోన్‌గా ప్రకటించారు. 1500 మంజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపును రంగంలోకి దించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. जोहार मोदी जी।🙏 मां भारती की सेवा में हर पल समर्पित,गरीबों, पिछड़ों,वंचितों के मसीहा,विश्व के सबसे लोकप्रिय राजनेता एवं देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी का छत्तीसगढ़ की न्यायधानी बिलासपुर में हार्दिक स्वागत एवं अभिनंदन।#CGWelcomesModiJi जय छत्तीसगढ़।🚩 pic.twitter.com/BKkLBAxxIB — Arun Sao (@ArunSao3) September 30, 2023 ఇది కూడా చదవండి: వందే భారత్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ -
అవినీతికి విపక్షాల రక్షణ
అందుకే పార్లమెంటు సమావేశాల స్తంభన: ప్రధాని మోదీ కాన్పూర్: అవినీతిపరులను రక్షించడానికే ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాల్ని స్తంభింపజేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అందుకే నోట్ల రద్దు, నల్లధనం వెలికితీత, ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చకు వెనుకంజ వేశాయని అన్నారు. వారికి ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఆసక్తి లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సోమవారం జరిగిన ‘పరివర్తన్ ర్యాలీ’లో ప్రధాని మోదీ మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవినీతి, నల్లధనాన్ని అంతం చేయడమే తమ ఎజెండా అని.. పార్లమెంటును స్తంభింపజేయడమే విపక్షాల ఎజెండా అని ఎద్దేవా చేశారు. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు, పార్టీలకు విరాళాలు తదితర అంశాలపై చర్చ జరపాలని తాను అఖిలపక్ష సమావేశంలో సూచించానన్నారు. అయితే విపక్షాలు నిరంతరం అరుపులు, నినాదాలతో పార్లమెం టును స్తంభింపజేసి, సభ ప్రతిష్టను దిగజార్చాయని మండిపడ్డారు. నేతలు రెచ్చగొట్టినా..: ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడిన ప్రజలను రెచ్చగొట్టడానికి కొంతమంది రాజకీయ నాయకులు యత్నించారని.. అయితే సాధారణ ప్రజలు అర్థం చేసుకుని సహకరించారని అన్నారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు వ్యవహరిం చారని ప్రశంసించారు. నోట్ల రద్దు అమల్లోకి వచ్చిన నవంబర్ 8న తాను ప్రజలను 50 రోజుల గడువు కోరిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తాను మొదట్నుంచీ అదే విషయం చెబుతున్నానని అన్నారు. ఇప్పుడు మరోసారి చెబుతున్నానని 50 రోజుల పాటే కష్టాలుంటాయని.. ఆ తర్వాత అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోతాయని మోదీ హామీ ఇచ్చారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని ఎవరనేది చరిత్ర గుర్తుంచుకోదని, అవినీతిపై ప్రజల పోరాటాన్నే చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. కాంగ్రెస్‌వన్నీ అబద్ధాలే: రాజీవ్ గాంధీ సామాన్య మానవుడికి కంప్యూటర్, మొబైల్ ఫోన్ అందించారని కాంగ్రెస్ నాయకులు తరచూ చెబుతుంటారని మోదీ అన్నారు. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ ను బ్యాంకు కార్యకలాపాలకు వినియోగించవచ్చని తాను చెబితే.. పేద ప్రజల వద్ద మొబైల్ ఫోన్ లేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ అబద్ధాలనే ప్రచారం చేస్తోందని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం నిరోధించడానికి ఎన్నికల సంఘం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇక్కడ మోదీ దేశంలోనే తొలి భారత నైపుణ్య సంస్థకు శంకుస్థాపన చేశారు. -
ఇక అది జనధనమే
జన్‌ధన్ ఖాతాల్లో జమ అయిన నల్లధనం పేదలకే ఆ ఖాతాల్లో డిపాజిట్ చేసిన నల్ల కుబేరులు జైలుకే - అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నేరమా? చేయొద్దా? - 70 ఏళ్లుగా క్యూలోనే నిలబడ్డ ప్రజలకు ఇదే చివరి క్యూ - నిజాయితీపరులు బ్యాంకు ముందు, అవినీతిపరులు పేదల ఇళ్ల ముందు క్యూ - వ్యతిరేకులు నన్నేం చేయగలరు? నేనో ఫకీర్ని.. - ప్రజలే నా నాయకులు... నాకు హైకమాండ్ లేదు - బిచ్చగాడు సైతం స్వైపింగ్ మిషన్ వాడుతున్నాడు - మొరాదాబాద్ బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోదీ కొందరు నన్ను నేరస్తుడిగా పిలుస్తున్నారు. గత 70 ఏళ్లుగా ఈ దేశంలో నెలకొన్న అన్ని అనర్థాలకు ప్రధాన కారణమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నేరమా?.. నేనేదో నేరం చేసినట్లు ప్రతిపక్షాలు నన్ను ఇబ్బంది పెడుతున్నారుు. నా ప్రత్యర్థులు నన్నేం చేయగలరు. నేనొక ఫకీర్‌ను... నా కొద్దిపాటి వస్తువులతో నేను వెళ్లిపోగలను. ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ.. వాట్సప్‌లో ఓ వీడియో హల్చల్ చేస్త్తోంది. ఒక వ్యక్తి తన వద్ద చిల్లర లేదని బిచ్చగాడికి చెబుతాడు. దీంతో బిచ్చగాడు స్వైపింగ్ మిషన్ బయటకు తీసి డెబిట్ కార్డు ఇమ్మంటాడు. అవినీతిపరులు, ధనవంతులు క్యూలో నిలబడి తమ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేయమని పేదల్ని కోరుతున్నారు. బ్యాంకుల ముందు నిలబడకుండా పేదల ఇళ్లముందు వారు క్యూ కడుతున్నారు. క్యూలలో గంటల కొద్దీ నిలబడ్డ దేశ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. క్యూలపై విపరీతంగా బాధపడుతున్న రాజకీయ నాయకుల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు స్వాతంత్య్రం తర్వాత మొత్తం దేశాన్ని దాదాపు 70 ఏళ్లు క్యూలో నిలబెట్టారు. పంచదార, కిరోసిన్, గోధుమల కోసం గతంలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. అలాంటి క్యూలకు ముగింపు పలికేందుకు ఇదే చివరి క్యూ. మొరాదాబాద్ : జన్‌ధన్ ఖాతాల్లో చేరిన నల్లధనం పేదలకే చెందుతుందని, ఆ ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసిన అవినీతిపరుల్ని ఎలా జైలుకు పంపాలన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలపై రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిత్యావసరాల కోసం 70 ఏళ్లుగా రోజూ వరుసలో నిలబడుతున్న వారికి ఇక ఇదే చివరి క్యూ అని అన్నారు. త్వరలో యూపీ ఎన్నికల నేపథ్యంలో మొరాదాబాద్‌లో నిర్వహించిన బీజేపీ పరివర్తన్ యాత్రలో శనివారం మోదీ ప్రసంగించారు.‘జన్‌ధన్ ఖాతాల్లో ఇతరులు డబ్బులు వేస్తే వాటిని తిరిగి ఇవ్వక్కర్లేదు. మీరు అలా చేస్తానని వాగ్దానం చేస్తే... అక్రమంగా డబ్బును మీ ఖాతాల్లో వేసిన వారిని జైలుకు పంపేందుకు ఒక ప్రణాళిక తెస్తా. ఆ డబ్బు పేదలకే చెందుతుంది’ అని అన్నారు. అక్రమార్కులు ఈ ధనాన్ని పేదల నుంచి దోచుకుని ఏన్నో ఏళ్లుగా పేదల కోసం ఎలాంటి మంచి చేయడం లేదన్నారు. ‘క్యూలలో గంటల కొద్దీ నిలబడ్డ దేశ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. క్యూలపై విపరీతంగా బాధపడుతున్న రాజకీయ నాయకుల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు స్వాతంత్య్రం తర్వాత మొత్తం దేశాన్ని దాదాపు 70 సంవత్సరాలు క్యూలో నిలబెట్టారు. పంచదార, కిరోసిన్, గోధుమల కోసం గతంలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. అలాంటి క్యూలకు ముగింపు పలికేందుకు ఇదే చివరి క్యూ’ అని వ్యాఖ్యానించారు. వారిని నేను సరిచేస్తా ‘గతంలో డబ్బు డబ్బు అని, ఇప్పుడు మోదీ జపం చేస్తున్నవారిని సరిచేస్తా.. అవినీతిపరులు, ధనవంతులు క్యూలో నిలబడి తమ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేయమని పేదల్ని కోరుతున్నారు. బ్యాంకుల ముందు నిలబడకుండా పేదల ఇళ్లముందు వారు క్యూ కడుతున్నారు’ అని మోదీ విమర్శించారు. ఏం జరిగినా ఈ పోరాటం ఆగదు నోట్ల రద్దు విషయంలో ప్రతిపక్షాలు తనను నేరస్తుడిగా పేర్కొంటున్నాయని ఆరోపించారు. ‘‘ కొందరు నన్ను నేరస్తుడిగా పిలుస్తున్నారు. గత 70 ఏళ్లుగా ఈ దేశంలో నెలకొన్న అన్ని అనర్థాలకు ప్రధాన కారణమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నేరమా?.. నేనేదో నేరం చేసినట్లు ప్రతిపక్షాలు నన్ను ఇబ్బంది పెడుతున్నారుు. నా ప్రత్యర్థులు నన్నేం చేయగలరు. నేనొక ఫకీర్‌ను... నా కొద్దిపాటి వస్తువులతో నేను వెళ్లిపోగలను’ అని చెప్పారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శిస్తూ.. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే నాయకులని, తనకు హైకమాండ్ లేదన్నారు. అవినీతి దానంతట అదే పోదని, దానిని రూపుమాపాల్సి ఉందన్నారు. ప్రభుత్వాలు కేవలం ప్రకటనలు చేయడానికే పరిమితం కాకూడదని... పథకాల్ని ప్రారంభించి, వాటిని సమర్థంగా అమలయ్యేలా చూడాలన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కేవలం తమ కోసం, సన్నిహితుల కోసం పనిచేశాయని, పేదల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. దాచుకున్న వారే విమర్శిస్తున్నారు... ‘అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదా? అవినీతి వ్యతిరేక పోరాటం నేరమా? అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే తప్పు చేస్తున్నానని ఎందుకు కొందరు విమర్శిస్తున్నారు? డబ్బు దాచుకున్న వారే నన్ను విమర్శిస్తున్నారు’ అని అన్నారు. అవినీతి నిర్మూలనకు క్యూలో నిలబడడం తప్పనిసరి ‘ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉంటాయని నేను ముందే చెప్పాను. పరిస్థితులు మెరుగుపడతారుు. మీరు నగదు విత్‌డ్రా కోసం క్యూలలో నిలబడవచ్చు. అరుుతే అవినీతి నిర్మూలనకు అది తప్పనిసరి’ అని అన్నారు. విద్యుత్ సరఫరా లేని 18 వేల గ్రామాలకు వెరుు్య రోజుల్లో సరఫరా చేస్తామని రెడ్ ఫోర్ట్ నుంచి ప్రకటించానని, ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా లేని 1000 గ్రామాలుండగా... సగం సమయంలోనే ఆ రాష్ట్రంలో 950 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ప్రధాని తెలిపారు. బిచ్చగాడి దగ్గరా స్వైపింగ్ మిషన్ చివరికి బిచ్చగాడు కూడా అడుక్కునేందుకు స్వైపింగ్ మిషన్ వాడుతున్నాడని, ప్రజలు కూడా డిజిటల్ చెల్లింపులకు మారాలంటూ మోదీ ఒక వాట్సప్ వీడియోను ఉదహరించారు. ‘ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ... వాట్సప్‌లో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఒక వ్యక్తి తన వద్ద చిల్లర లేదని బిచ్చగాడికి చెబుతాడు. ఇంతలో బిచ్చగాడు ఆందోళన వద్దంటూ స్వైపింగ్ మిషన్ బయటకు తీసి డెబిట్ కార్డు ఇమ్మని అడుగుతాడు’ అంటూ ప్రధాని అనగానే బహిరంగసభలో నవ్వులు పూశారుు. నిర్ణయం వెనుక ఉద్దేశం సరైనదైతే కొత్త విషయాల్ని అంగీకరించేందుకు భారతీయులు ఎక్కువ సమయం తీసుకోరని మోదీ పేర్కొన్నారు. డిజిటల్‌కు మారండి ప్రజలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు మారాలని మోదీ సూచించారు. మొబైల్ ఫోన్లను వాలెట్లుగా వాడాలని, ప్లాస్టిక్ మనీని ఉపయోగించాలని, దాంతో నగదు అవసరముండదన్నారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, వాటి ద్వారా నగదు రహిత చెల్లింపులు చేయాలన్నారు. ‘ఈ రోజుల్లో మొబైల్ బ్యాకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రతీది దొరుకుతుంది. మీ ఫోన్లో కేవలం యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే... బ్యాంకులకు వెళ్లకుండా, క్యూలో నిలబడకుండా ప్రతీది సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు. మార్పును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, దేశం ఇంకా సాంకేతికంగా అభివృద్ధి చెందలేదని చెపుతున్న వారిని మోదీ తప్పుపట్టారు. ‘అదే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో బటన్ నొక్కే ఎన్నుకున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని ప్రతిపక్షాలకు సూచించారు.దేశం నుంచి పేదరికం నిర్మూలించాలంటే ముందుగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి పేదరికాన్ని రూపుమాపాలన్నారు. స్వర్ణదేవాలయంలో వడ్డించిన మోదీ అమృత్సర్: హార్ట్ ఆఫ్ ఆసియా కాన్ఫరెన్సలో పాల్గొనేందుకు అమృత్సర్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అస్రఫ్ ఘనీలు శనివారం సాయంత్రం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ముందుగా చారిత్రక కారిడార్‌లో కొద్దిసేపు నడిచి అనంతరం స్వర్ణదేవాయాలనికి వెళ్లారు. ఈ సందర్భంగా భారీగా గుమిగూడిన ప్రజలు వారికి ఘన స్వా గతం పలికారు. వీరి రాక సందర్భంగా స్వర్ణ దేవాలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. ఆలయంలో దాదాపు 30 నిమిషాలు గడిపిన మోదీ, ఘనీలు ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వంటగదిలో భక్తులకు మోదీ ఆహారపదార్థాల్ని వడ్డించారు. ఇద్దరు అధినేతలకు ఆలయ నిర్వాహకులు 24 క్యారెట్ల స్వర్ణ దేవాలయం ప్రతిమను అందచేశారు. త్వరలో పంజాబ్‌లో ఎన్నికల నేపథ్యంలోనే మోదీ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఘనీ, మోదీలు నేడు అమృత్‌సర్‌లో జరిగే హార్ ఆఫ్ ఆసియా మినిస్టీరియల్ సదస్సును ప్రారంభిస్తారు. -
ఆ డబ్బు అంతా మీకే వచ్చాలా చూస్తాను!
మొరాబాద్: ‘నాకు హైకమాండ్ లేదు. ప్రజలే నా హైకమాండ్. వారే నాకు ముఖ్యం. వారికే నేను నివేదిస్తాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో శనివారం జరిగిన పరివర్తన్ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పెద్దనోట్ల రద్దుపై భావోద్వేగంగా మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తన నేరమా? అవినీతి అంతానికి పోరాడినవాడు నేరస్తుడు అవుతాడా? అని ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు తనను నిందిస్తుండటం చూసి ఆశ్చర్యం కలుగుతోందని, పేదల కోసం పనిచేయడమే తాను చేసిన తప్పా? అని ఆయన అన్నారు. ఆ డబ్బు అంతా మీకే వచ్చాలా చూస్తాను! ‘నేను మీ కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నాను. ఆ అవినీతిపరులు నన్నేమీ చేయగలరు? మహా అయితే ఏం చేస్తారు? నేను ఫకీర్‌ను. జోలె సర్దుకొని ఏ క్షణమైన వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. ధనికులు ఇప్పుడు పేదల ఇళ్లముందు క్యూలు కడుతున్నారని, పెదలను పొగుడుతూ.. మీ జన్‌ధన్ ఖాతాల్లో రూ. 2-3 లక్షలు వేసుకోమని బతిమిలాడుతున్నారని అన్నారు. శక్తిమంతులు, నిజాయితీపరులు ఇప్పుడు బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారని, ధనికులు మాత్రం రహస్యంగా పేదల ఇళ్ల ముందు క్యూలు కట్టి వారి జన్‌ధన్ ఖాతాల్లో డబ్బులు వేసుకోమని వేడుకుంటున్నారని అన్నారు. ‘ఎవరి డబ్బు అయినా మీ ఖాతాల్లో వేసుకుంటే.. అందులో ఒక్క పైసా కూడా విత్‌డ్రా చేయకండి. వాళ్లు మీ ఇంటి చుట్టూ చక్కర్లు కొడతారు. మిమ్మల్ని వేడుకుంటారు. మీ కాళ్ల మీద పడతారు. ఎవరైనా మిమ్మల్ని హెచ్చరిస్తే.. నేను ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ధైర్యంగా చెప్పండి. మీ ఖాతాల్లో చేరిన నల్లధనాన్ని విత్‌డ్రా చేయబోమని హామీ ఇవ్వండి. అలా చేస్తే మీ ఖాతాల్లో డబ్బు వేసిన వారిని జైలుకు పంపించి.. ఆ డబ్బు మీ ఇంటికి చేరే మార్గాన్ని నేను కనిపెడతాను’ అని మోదీ స్పష్టం చేశారు. మీ జన్‌ధన్ ఖాతాలోని డబ్బులు వాపస్ ఇవ్వాలని ధనికులు అడిగితే.. ఎదురు ప్రశ్నించాలని, ఆధారాలు అడుగాలని ప్రధాని మోదీ సూచించారు. ఆ డబ్బు అంతా పేదలకే చెందేలా చేస్తానని హామీ ఇచ్చారు. కాలం మారిందని, కాలంతోపాటు మనమూ మారాలని సూచించారు. మొబైల్‌ఫోన్‌లోకే బ్యాంకు వచ్చేసిందని, మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోళ్లు చేయవచ్చునని చెప్పారు. -
ఆ డబ్బు అంతా మీకే వచ్చాలా చూస్తాను!