Parivartan Yatra
-
రైతు సంక్షేమంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)– ‘పరివర్తన్’లో భాగంగా 2025 నాటికి సంవత్సరానికి రూ. 60,000 కంటే తక్కువ సంపాదించే 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘‘గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం అంటే స్థిరమైన వృద్ధిని పెంపొందించడమే. అలాగే బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి సంబంధించి మా నిరంతర నిబద్ధతను మా కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద సీఎస్ఆర్ కార్యక్రమాలలో పరివర్తన్ ఒకటిగా ఎదిగింది’’ అని బ్యాంక్ డిప్యూటీ. మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ ఎం భారుచా అన్నారు. భారత్‌లోని సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభమైన హెచ్డీఎఫ్సి బ్యాంక్ ‘పరివర్తన్’ తన లక్ష్య సాధనలో పురోగమిస్తోందని ఆయన అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. → గత దశాబ్ద కాలంలో రూ. 5,100 కోట్లకు పైగా సీఎస్ఆర్ వ్యయంతో ‘పరివర్తన్’ కింద స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, అభివృద్ధిని పెంపొందించడం, జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను కొంతమేర బ్యాంక్ సాకారం చేసుకుంది. → బ్యాంక్ తన సీఎస్ఆర్ చొరవ కింద దాదాపు 2 లక్షల మందికి స్వయం సమృద్ధిని పెంచడానికి నైపుణ్య శిక్షణను అందించాలని యోచిస్తోంది. → 2 లక్షల ఎకరాలను నీటిపారుదల కిందకు తీసుకువచి్చ, సాగుకు అనువైనదిగా తీర్చి దిద్దడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, 25,000 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు విద్య అవకాశాలను మెరుగుపరచడం, ఇందుకు స్కాలర్షిప్లు వంటివి అందించడం వంటి కార్యకలాపాలను బ్యాంక్ యోచిస్తోంది. → 17 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) తొమ్మిదింటిని సాకారం చేయడానికి బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వీటిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటు వంటివి ఉన్నాయి. → సమాజ ఆర్థిక శ్రేయస్సును ప్రతి బాధ్యతగల బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఈ సూత్రానికి తన నిబద్ధతను బ్యాంక్ నిరంతరం ఉద్ఘాటిస్తుంది. దేశ నిర్మాణానికి దోహదపడే కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 945.31 కోట్లను తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వెచి్చంచింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 125 కోట్లు అధికం. → కంపెనీల చట్టం 2013 ప్రకారం, సీఎస్ఆర్ నిబంధనలు వర్తించే ప్రతి కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన దాని సగటు నికర లాభాలలో కనీసం 2 శాతం ఖర్చు చేసేలా చూసుకోవాలి. → బ్యాంక్ నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,109 కోట్లుకాగా, 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిమాణం 38 శాతం పెరిగి రూ.60,812 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దాదాపు రూ. 950 కోట్లు సీఎస్ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంది.గ్రీన్ ఎకానమీ పురోగతికి ప్రాధాన్యం...భారతదేశ జనాభాలో 65 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, గ్రామాలలో ప్రజల శ్రేయస్సు, జీవనోపాధి దేశ సమగ్ర అభివృద్ధికి కీలకమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ (సీఎస్ఆర్) నుస్రత్ పఠాన్ అన్నారు. బ్యాంక్ తన కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయని వెల్లడించారు. 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారేందుకు బ్యాంక్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు. ఈ చొరవలో భాగంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గ్రీన్ ఇనిíÙయేటివ్లో భాగంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ తన మొట్టమొదటి ఫైనాన్స్ బాండ్ ఇష్యూ ద్వారా 300 మిలియన్ డాలర్లను సేకరించిందని ఆయన చెప్పారు. సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లు, ఈవీలుసహా గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. -
బీసీననే నాపై ద్వేషం: ప్రధాని మోదీ
బిలాస్పూర్: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాల ఇండియా కూటమిని అహంకారుల గ్రూప్‌గా, కాంగ్రెస్‌కు తానంటే ఎనలేని ద్వేషమని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘అసలు బీసీలన్నా, ఎస్సీలు, ఎస్టీలన్నా, ముఖ్యంగా పేదలన్నా ఆ పారీ్టకి ఎనలేని ద్వేషం. అందుకే కాంగ్రెస్ వాళ్లు నన్ను నోటికొచి్చనట్టు తిట్టిపోస్తుంటారు. ఆ నెపంతో వాళ్లు అవమానించేది నిజానికి బీసీలను’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు శిక్షించినా వారి వైఖరి అసలే మారలేదని దుయ్యబట్టారు. ‘రాష్ట్రపతి పదవికి దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ అభ్యరి్థత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. తాజాగా ఆదివాసీ మహిళ అయిన ద్రౌపదీ ముర్ము అభ్యర్థిత్వాన్నీ అలాగే వ్యతిరేకించింది. ఆయా సామాజికవర్గాల పట్ల ద్వేషమే అందుకు కారణం తప్ప సైద్ధాంతిక విభేదాలు కాదు. లేదంటే యశ్వంత్ సిన్హా వంటి మాజీ బీజేపీ నేతను పోటీగా బరిలో దింపేవారే కాదు’ అని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం బిలాస్పూర్లో బీజేపీ నిర్వహించిన ‘పరివర్తన్ మహాసంకల్ప’ ర్యాలీలో మోదీ మాట్లాడారు. 30 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏమీ చేయని కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీల అహంకార గ్రూప్ తాను బిల్లును ఆమోదం దాకా తీసుకెళ్లడం చూసి ఆశ్చర్యపోయిందన్నారు. ‘అందుకు వాళ్లు నాపై ఆగ్రహంగా కూడా ఉన్నారు. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే మహిళా బిల్లుకు వాళ్లు మద్దతిచ్చారు. ఇప్పుడిక మోదీకి మహిళలంతా ఎక్కడ మద్దతు పలుకుతారోనని భయపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను ఓబీసీలకు కూడా వర్తింపజేయాలంటూ కొత్త నాటకానికి కాంగ్రెస్ తెర తీసింది. తద్వారా మహిళల మధ్యా విభేదాలు రాజేసేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆరోపించారు. ‘మహిళా రిజర్వేషన్ల ప్రభావం వేలాది ఏళ్ల పాటు ఉంటుంది. మీ కూతుళ్ల భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది’ అని అన్నారు. ‘అమ్మలరా. అక్కాచెల్లెళ్లారా! కాంగ్రెస్ వంటి అబద్ధాలకోర్ల వలలో పడకండి. నాకు మీ ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. అప్పుడే మీతో పాటు ప్రతి ఒక్కరి ఆకాంక్షలనూ నెరవేర్చగలుగుతా’ అని పేర్కొన్నారు. అవినీతి కూపంలో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మోదీ ఆరోపించారు. ఖజానాలో డబ్బులకు కొదవే లేదని, కేంద్రం నుంచి వేలాది కోట్లు వస్తున్నాయని సాక్షాత్తూ ఆ పారీ్టకి చెందిన ఉప ముఖ్యమంత్రే వేదికపై చెప్పారని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో ప్రతి స్కీమ్‌లోనూ స్కామే. ఆ పారీ్టకి గనక మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మరింత దోచుకుంటుంది’ అని దుయ్యబట్టారు. -
ఛత్తీస్‌గఢ్ పరివర్తన్ యాత్ర ముగింపు సభకు ప్రధాని
రాయ్‌పూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధపడే క్రమంలో బీజేపీ పరివర్తన్ మహాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పరివర్తన్ సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యక్రమం ముగింపు సభకు ప్రధాని కానున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో. రెండు పరివర్తన యాత్రల ముగింపు సందర్బంగా బిలాస్పూర్ సైన్స్ కాలేజీ వేదికగా జరుగనున్న సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నట్లు తెలిపారు. అప్పుడు ఘోర పరాజయం.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని తిరిగి చేజికించుకోవాలన్న తాపత్రయంతో ఉంది బీజేపీ. ఆ రాష్ట్రంలో రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా పరిపాలన కొనసాగించిన బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం 15 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 71కి పెరిగింది. పరివర్తన్ యాత్ర.. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ బీజేపీ పరివర్తన్ మహా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రెండు పరివర్తన యాత్రలను ముగించుకున్న బీజేపీ ముగింపు సభను బిలాస్పూర్లో జరుపుకోనుంది. 3000 కిమీ మేర సాగిన మొదటి రెండు విడతల యాత్రలో మొత్తం 87 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. నక్సల్ ప్రభావిత అసెంబ్లీ స్థానాలను మినహాయించి అన్ని నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించాలన్నది బీజేపీ ప్రణాళిక. కాంగ్రెస్ పని అయిపొయింది.. ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో మాట్లాడుతూ.. ఈసారి ఛత్తీస్‌గఢ్‌లో ఎగరబోయేది బీజేపీ జెండానే అని ఈరోజు బిలాస్పూర్లో జరగబోయే ప్రధాని సభతో ఆ విష్యం తేటతెల్లమవుతుంది అన్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో మొదలై దిగ్విజయంగా సాగిన రెండు యాత్రల్లోనూ దాదాపు 50 లక్షల మంది జనం హాజరయ్యారని ఈరోజు సభకు కూడా అదే స్థాయిలో జనం వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన పరివర్తన్ సంకల్ప యాత్రలను చూసి కాంగ్రెస్ సగం కుంగిపోయిందని వారిలో అప్పుడే ఓటమి భయం మొదలైందని అన్నారు. భారీ భద్రత.. ఇదిలా ఉండగా బిలాస్‌పూర్‌లోని ప్రధాని సభకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు ఛత్తీస్‌గఢ్ పోలీసులు. సభాప్రాంగణానికి చుట్టూ మూడు కిలోమీటర్ల వ్యాసార్ధాన్ని నో ఫలియింగ్ జోన్‌గా ప్రకటించారు. 1500 మంజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపును రంగంలోకి దించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. जोहार मोदी जी।🙏 मां भारती की सेवा में हर पल समर्पित,गरीबों, पिछड़ों,वंचितों के मसीहा,विश्व के सबसे लोकप्रिय राजनेता एवं देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी का छत्तीसगढ़ की न्यायधानी बिलासपुर में हार्दिक स्वागत एवं अभिनंदन।#CGWelcomesModiJi जय छत्तीसगढ़।🚩 pic.twitter.com/BKkLBAxxIB — Arun Sao (@ArunSao3) September 30, 2023 ఇది కూడా చదవండి: వందే భారత్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ -
చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా
జైపూర్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జైపూర్‌లో 'పరివర్తన యాత్ర' ప్రారంభోత్సవంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. త్వరలో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుంగార్పూర్ వేదికగా 'పరివర్తన యాత్ర'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతుంది ఇండియా కూటమి హిందూత్వాన్ని వ్యతిరేకమని.. ఇది ఒకరకంగా హిందూత్వ వారసత్వంపై దాడి చేయడమేనని.. స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. డీఎంకే నాయకుడి కుమారుడు.. కాంగ్రెస్ నేత కుమారుడు మారణహోమానికి పిలుపునిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాడికల్ హిందూ సంస్థలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కంటే ప్రమాదమని అన్నారు. మీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఇది హిందూ ఉగ్రవాదమని అన్నారు. కానీ ఈనాడు సనాతన ధర్మం ప్రజల మనుసును గెలుచుకుందని మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే సనాతన పరిపాలన వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు అడ్డుకుందని.. మా హయాంలోనే రామ మందిరం నిర్మాణ పనులు మొదలయ్యాయని జనవరికల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన 'పరివర్తన యాత్ర' 19 రోజుల పాటు 2500 కి.మీ కొనసాగుతుందని.. మొత్తం 52 నియోజకవర్గాల్లో 152 చిన్న సభలు.. 54 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు సనాతన ధర్మం మతం పేరిట ప్రాంతం పేరిట ప్రజలను వేరు చేసే సిద్ధాంతమని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నేను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు. సనాతన ధర్మం వలన అణగారిన వర్గాల తరపునే నేను ఆ మాటలన్నానని తెలిపారు. మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. కులం దేశానికి శాపమని అన్నారు. చెన్నైలో రైటర్ల సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేమని నిర్మూలించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
ఇక్కడ గెలిచాక ఢిల్లీలో ‘పరివర్తన్’
కలైకుందా/గర్బేటా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక, ఢిల్లీలో పరివర్తన్ (మార్పు) తీసుకొస్తానని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచాక తాను కేంద్ర రాజకీయాల్లో అడుగుపెడతానని, ప్రత్యామ్నాయంగా మారుతానని బీజేపీ భయపడుతోందని, అందుకే ఆ పార్టీ పెద్దలంతా బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. పరివర్తన్ అంటూ తాను ఇచ్చిన నినాదాన్ని బీజేపీ దొంగిలించిందని, దాన్ని అసోల్ పరివర్తన్ (అసలైన మార్పు) అంటూ రీమోడలింగ్ చేసిందని విమర్శించారు. మమతా బెనర్జీ గురువారం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే.. బీజేపీతో కూటమి కుమ్మక్కు ‘‘పోలీసులపై నాకు గౌరవం ఉంది. వారు తప్పుడు పనులు చేయరు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో గోల్మాల్ చేయాలని బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట అయిన జంగల్‌మహల్ సమగ్రాభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. బెంగాల్లో సీపీఎం–కాంగ్రెస్ కూటమి మతతత్వ బీజేపీతో చేతులు కలిపింది. అందుకే మార్క్సిస్టు మిత్రులు కూడా ఆ కూటమి అభ్యర్థులకు ఓటేయవద్దు. గాంధీజీని హత్య చేసిన వారితో సంబంధాలున్న వారికి ఒక్క ఓటు కూడా వేయొద్దు. దుర్గాపూజకు రూ.50,000 ఇస్తాం తృణమూల్ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే బెంగాల్లో ఓడరేవులు, పరిశ్రమలు స్థాపిస్తాం. భారతీయ రైల్వేను అమ్మేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రైల్వే ఉద్యోగులు ఆ పార్టీని ఓడించాలి. మా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి తక్కువ వడ్డీతో రూ.10 లక్షల రుణం మంజూరు చేస్తాం. దుర్గాపూజ చేసుకోవడానికి కమ్యూనిటీ క్లబ్‌లకు రూ.50 వేల చొప్పున ఇస్తాం. డబ్బు సంచులు తెస్తున్నారు బీజేపీ అబద్ధాల పార్టీ, ఇచ్చిన హామీలను ఆ పార్టీ ఎప్పుడూ నెరవేర్చదు. నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లుగా రూ.15 లక్షలు ప్రజలకు అందాయా? ప్రధానమంత్రిగా కుర్చీ ఎక్కాక ఆయన తన çహామీని తుంగలో తొక్కారు. బెంగాల్లో కరోనా మహమ్మారిని సమర్థంగా నియంత్రిస్తున్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కరోనా మళ్లీ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగర సంస్కృతిలో భాగమైన ‘కోల్‌కతా కాఫీ హౌస్’పై ఆధిపత్యం చెలాయించడానికి బీజేపీ గూండాలు కుట్ర పన్నుతున్నారు. దాని గొప్పదనం వారికి తెలియదు. నందిగ్రామ్‌లో బీజేపీ నేతలు నాపై దాడి చేశారు. ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కోట్లాది రూపాయల అక్రమాలు సాగించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతోంది. ఆ డబ్బుకు లెక్కాపత్రం ఉండడం లేదు. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బు సంచులు హెలికాప్టర్లు, విమానాల్లో తీసుకొస్తున్నారు. బెంగాల్లో ఎలాగైనా నెగ్గాలని కుట్ర పన్నుతున్నారు’’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. -
మే 2 తర్వాత మమత ఆట ముగిసిపోతుంది: మోదీ
పురూలియా: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆట ముగిసిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. దీదీ సర్కార్‌కి రోజులు దగ్గర పడ్డాయని, అసలు సిసలు పరివర్తన ఇక మొదలు కానుందని అన్నారు. ‘‘దీదీ మీరు పదేళ్లు మీ ఆట ఆడారు. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే దీదీ ఖేలా శేష్ హోబె, వికాస్ ఆరంభ్ హోబె (ఆమె ఆట ముగిసిపోతుంది, మా అభివృద్ధి ప్రారంభమవుతుంది)’’అని ప్రధాని అన్నారు. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కానున్న నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతమైన జంగల్‌మహల్ ప్రాంతంలోని పురూలియాలో గురువారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని తృణమూల్ కాంగ్రెస్ ఖేలా హోబె (ఆట మొదలైంది) నినాదాన్ని ప్రస్తావిస్తూ మాటల తూటాలు విసిరారు. ‘మమత ఎన్నికల ర్యాలీలో తరచూ ఆట మొదలైంది అని అంటూ ఉంటారని ఆమెకు ఆట మొదలైందేమో కానీ బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, విద్య, మహిళా సాధికారత, ఉద్యోగాలు, పక్కా ఇళ్లు, సురక్షిత నీరు, ఇంటింటికీ కుళాయిలు అన్నీ మొదలవుతాయని ప్రధాని గట్టిగా చెప్పారు. కట్ మనీ ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి బురదలో కూరుకుపోయిందని ప్రధాని ఆరోపించారు. కమీషన్లు లేనిదే ప్రభుత్వం పని చేయడం లేదని, అధికార పార్టీ చేస్తున్న ఈ దోపిడీ వల్ల దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు అధికంగా నష్టపోతున్నారని అన్నారు. భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని మధ్య మధ్యలో బెంగాలీలో కొన్ని వాక్యాలు మాట్లాడుతూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘‘మీరు చాలా కాలంగా ప్రజల్ని అణచివేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో మిమ్మల్ని ఓడిస్తాం’’అని సభికుల హర్షధ్వానాల మధ్య బెంగాలీలో చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పదానికి ప్రధాని కొత్త అర్థాన్ని ఇచ్చారు. టీఎంసీ అంటే ట్రాన్స్ఫర్ మై కమిషన్ అని అభివర్ణించారు. కేంద్రం డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానాన్ని అనుసరిస్తూ ఉంటే, తృణమూల్ కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ మై కమిషన్ అంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని లూటీ చేసే మావోయిస్టులను మమత సర్కార్ పెంచి పోషిస్తోందని మోదీ ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ స్వాహా వెనుకబడిన ప్రాంతాలకి, వర్గాలకి కేంద్రం అందించే నిధులేవీ మమత ప్రజలకు ఇవ్వడం లేదని ప్రధాని ఆరోపించారు. ‘కేంద్రం పక్కా గృహాల కోసం నిధులు ఇచ్చింది. టీఎంసీ సర్కార్ దానిని స్వాహా చేసింది. నిరుపేదలకు తక్కువ ధరకే బియ్యం పంపాం. టీఎంసీ దోపిడీదారులు దానిని మింగేశారు. లాక్డౌన్ సమయంలో ఉచిత బియ్యం ఇచ్చాం. దీదీ సర్కార్ వాటిని బొక్కేసింది. అంఫాన్ తుపాను సమయంలోనూ అదే తీరు. రైతన్నలు, సాంతాల్ గిరిజనులు సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. వారిపై మమత కురిపించలేదు’’అనివిమర్శించారు. మమత తన ఆటలో తాను మునిగితేలిపోతున్నారని, దీంతో ఈ గిరిజన ప్రాంతానికి పరిశ్రమలు రావడం లేదని, నీళ్లు లేక వ్యవసాయం సంక్లిష్టంగా మారి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ జనం వలస బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వలసల్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. -
పరివర్తన్... బెంగాల్లో కాదు ఢిల్లీలో
సిలిగురి/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. వారిద్దరూ అతిపెద్ద దోపిడీదారులని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షా హయాం సిండికేట్మయంగా మారిందన్నారు. వారిద్దరి పర్యవేక్షణలోనే డబ్బు యథేచ్ఛగా చేతులు మారుతోందని ఆరోపించారు. బెంగాల్లో అసలైన పరివర్తన్(మార్పు) రావాలంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. పరివర్తన్ బెంగాల్లో కాదు, ఢిల్లీలో వస్తుందని స్పష్టం చేశారు. ఎల్పీజీ ధరల పెరుగుదలకు నిరసనగా బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఆమె ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మోదీ ఉత్తుత్తి హామీలతో మోసం చేస్తున్నారని, ఆయనను జనం ఇక నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా డబ్బు ఎలా వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి, ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ సొమ్మును ఇంకా ఎందుకు డిపాజిట్ చేయలేదని నిలదీశారు. మోదీ చెప్పే కల్ల బొల్లి కబుర్లను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. పెరుగుతున్న ధరలతో వంట గ్యాస్‌కు సామాన్య ప్రజలు దూరమవుతున్నారని అన్నారు. జేపీకి బుద్ధి చెప్పాలి అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నందుకు మోదీ సిగ్గుపడాలని మమత అన్నారు. ఆయన బెంగాలీ భాషలో ప్రసంగిస్తుంటారని, స్క్రిప్టును మాత్రం గుజరాతీలో రాసుకుంటారని ఎద్దేవా చేశారు. బెంగాల్‌కు గురించి, ఇక్కడి సంస్కృతి గురించి మోదీకి ఏం తెలుసని ప్రశ్నించారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు చేస్తోందని, మతం, భాష అంటూ చీలికలు తెస్తోందన్నారు. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతుగా ప్రచారం చేయాలని మమత, జార్ఖండ్ సీఎం హేమంత్‌కు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ మూలాలున్న ప్రజలు బెంగాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ఓట్లపై తృణమూల్ కాంగ్రెస్ గురిపెట్టింది. -
కట్‌మనీ సంస్కృతిని అంతం చేస్తాం
కాక్ద్వీప్/డైమండ్ హార్బర్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ప్రభుత్వం కట్‌మనీ సంస్కృతిని తీసుకొచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కట్‌మనీ సంస్కృతిని అంతం చేస్తామన్నారు. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్ర పరమార్థం ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేను మార్చడం కాదని.. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం, బెంగాల్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమేనని స్పష్టం చేశారు. బెంగాల్‌ను సోనార్ బంగ్లాగా(బంగారు బంగ్లా) మార్చడానికే బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. తమ బూత్‌స్థాయి కార్యకర్తలకు, టీఎంసీ సిండికేట్‌కు మధ్య ఈ పోరాటం సాగుతోందని తెలిపారు. అమిత్ గురువారం బెంగాల్లో మరో దశ పరివర్తన్ యాత్రను ప్రారంభించారు. మేనల్లుడి కోసమే ముఖ్యమంత్రి ఆరాటం బెంగాల్లో అంఫన్ తుపాను బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను టీఎంసీ నేతలు కాజేశారని అమిత్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే తుపాన్లు, పర్యావరణ విపత్తుల నుంచి ప్రజలను కాపాడడానికి ప్రత్యేక టాస్క్ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలల్లో సరస్వతి పూజను మమతా బెనర్జీ అడ్డుకున్నారని దుయ్యబట్టారు. బెంగాల్లో రాజకీయ హింస కారణంగా 130 మందికిపైగా బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంసీ గూండాల ఆగడాలు ఇకపై సాగవని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలను హత్య చేసిన అరాచక శక్తులను కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను పక్కనపెట్టి, కేవలం ఆమె మేనల్లుడి సంక్షేమం కోసమే పని చేస్తున్నారని ఆక్షేపించారు. బెంగాల్లో సిండికేట్ పాలనను అంతం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేస్తామన్నారు. అమిత్ షా గురువారం 24 పరగణాల జిల్లాలోని నారాయణపూర్ గ్రామంలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన సుబ్రతా బిశ్వాస్ ఇంట్లో భోజనం చేశారు. ఈ గ్రామంలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. కట్‌మనీ అంటే? బెంగాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వర్తింపజేయడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల నుంచి వసూలు చేస్తున్న కమిషన్‌ను కట్‌మనీగా వ్యవహరిస్తున్నారు. అంటే ఏదైనా పథకం కింద లబ్ధి పొందాలంటే అధికార పార్టీ నాయకులకు వారు అడిగినంత ముట్టజెప్పాల్సిందే. లేకపోతే అనర్హులవుతారు. -
‘ముచ్చటేలేదు.. 150 కొట్టేస్తాం.. ’
సాక్షి, బెంగళూరు : ‘సిద్ద రామయ్య ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీని ఇక మా రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మార్పు మొదలైంది. మరో మాటకు అవకాశం లేదు. కచ్చితంగా 150 సీట్లు గెలిచి తీరుతాం’ అని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత 75 రోజులుగా పరివర్తన యాత్ర చేస్తున్న ఆయన తన సొంత జిల్లా మాండియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పచ్చి అవకాశ వాది అని, హిందుత్వం పేరిట లాభం పొందాలనుకుంటున్నారని అన్నారు. హిందువుల గురించి తెగ మాట్లాడుతున్న రాహుల్ ఎన్నికలు ముగిశాక ఆ విషయం మరిచిపోతారని విమర్శించారు. ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని, లింగాయత్‌లు వీరశైవులు తన దృష్టిలో ఒకటేనని చెప్పారు. గుజరాత్ 150 సీట్ల మార్క్ బీజేపీ అందుకోలేకపోయిందిగా అని ప్రశ్నించగా కర్ణాటకలో మాత్రం తమ పార్టీ కచ్చితంగా 150 సీట్ల మార్క్‌ను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నేరం అవుతుంది: యడ్యూరప్ప
'సాక్షి, కోలారు : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది నేరం అవుతుంది.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రజల విశ్వాసం కోల్పోయారు.. గత ఐదేళ్లుగా ప్రజలను వంచించింది మినహాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. శ్రీనివాసపురం పట్టణంలో పరివర్తన యాత్రలో భాగంగా శనివారం నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎత్తినహొళె పథకంలో యంత్ర పరికరాలను, పైప్లైన్లను కొనుగోలు చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులు ప్రజలను మోసం చేసి మభ్యపెడుతున్నారని, ఈ పథకాన్ని పూర్తిగా మూలన పడేశారని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రమేష్‌కుమార్ సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో సౌలభ్యాలు కరవయ్యాయన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో మామిడి అభివృద్ధి మండలికి నిధులు మంజూరు చేస్తే వాటిని సక్రమంగా ఖర్చు చేయడంలో ఇప్పటి సీఎం పూర్తిగా విఫలమయ్యారన్నారు. దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, కర్నాటకలో కూడా పుట్టగతులుండవని యడ్యూరప్ప హెచ్చరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, ఆర్.అశోక్, లోక్‌సభ సభ్యుడు పి.సి.మోహన్, కేజీఎఫ్ ఎమ్మెల్యే వై.రామక్క, హెబ్బాళ ఎమ్మెల్యే వై.ఎ.నారాయణస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి.పి.వెంకటమునియప్ప, మాజీ ఎమ్మెల్యేలు వై సంపంగి, ఎం.నారాయణస్వామి పాల్గొన్నారు. -
వారందరూ కొట్లాటలో బిజీగా ఉన్నారు
-
వారందరూ కొట్లాటలో బిజీగా ఉన్నారు
ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ అభివృద్ధిని పక్కన పెట్టి, ఒక్కరినొక్కరూ కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారని బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ఓ వైపు బాబాయ్ శివపాల్ యాదవ్, మరోవైపు అబ్బాయ్ అఖిలేష్ యాదవ్‌లు కొట్టుకుంటుంటే, బహుజన సమాజ్ పార్టీ సుప్రిం మాయావతి దుర్వినియోగాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన భారతీయ జనతా పార్టీ పోల్ క్యాంపెయిన్ 'పరివర్తన యాత్ర'ను సహారన్పూర్లో ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా యాదవ్ ప్యామిలీ, బీఎస్పీ అధినేత మాయవతిపై అమిత్‌షా విరుచుకుపడ్డారు. ఎస్పీ, బీఎస్పీలు ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలను మెరుగుపరచడంలో విఫలమవుతున్నాయని, కేవలం బీజేపీ మాత్రమే యూపీలో దౌర్జన్యాలను అరికడుతుందన్నారు. యూపీని అభివృద్ధి పథంలో ముందజంలో నిలిపేందుకు కేవలం ఒక్క బీజేపీ పార్టీనే ఎంతగానో శ్రమించిందని, ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. త్రిపుల్ తలాక్ రద్దును సమర్థించిన ఆయన, ముస్లిం మహిళలు తమ హక్కులను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. మహిళల హక్కులపై ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలను ఆయన హెచ్చరించారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్‌పై, మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ ఆత్మహత్యపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన ఈ విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని గుర్తుచేశారు. జవాను మృతిచెందడాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం నిజంగా చాలా అసహ్యకరంగా ఉందని విమర్శించారు.అమిత్ షా నిర్వహించిన ఈ యాత్రలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, కల్రాజ్ మిశ్రా, కేశల్ ప్రసాద్ మౌర్య, సంజీవ్ బల్యాన్, సంగీత్ సోమ్లతో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.