బిలాస్‌పూర్: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాల ఇండియా కూటమిని అహంకారుల గ్రూప్‌గా, కాంగ్రెస్‌కు తానంటే ఎనలేని ద్వేషమని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘అసలు బీసీలన్నా, ఎస్సీలు, ఎస్టీలన్నా, ముఖ్యంగా పేదలన్నా ఆ పారీ్టకి ఎనలేని ద్వేషం. అందుకే కాంగ్రెస్ వాళ్లు నన్ను నోటికొచి్చనట్టు తిట్టిపోస్తుంటారు. ఆ నెపంతో వాళ్లు అవమానించేది నిజానికి బీసీలను’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు శిక్షించినా వారి వైఖరి అసలే మారలేదని దుయ్యబట్టారు.
‘రాష్ట్రపతి పదవికి దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ అభ్యరి్థత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. తాజాగా ఆదివాసీ మహిళ అయిన ద్రౌపదీ ముర్ము అభ్యర్థిత్వాన్నీ అలాగే వ్యతిరేకించింది. ఆయా సామాజికవర్గాల పట్ల ద్వేషమే అందుకు కారణం తప్ప సైద్ధాంతిక విభేదాలు కాదు. లేదంటే యశ్వంత్ సిన్హా వంటి మాజీ బీజేపీ నేతను పోటీగా బరిలో దింపేవారే కాదు’ అని ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం బిలాస్‌పూర్‌లో బీజేపీ నిర్వహించిన ‘పరివర్తన్ మహాసంకల్ప’ ర్యాలీలో మోదీ మాట్లాడారు. 30 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏమీ చేయని కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీల అహంకార గ్రూప్ తాను బిల్లును ఆమోదం దాకా తీసుకెళ్లడం చూసి ఆశ్చర్యపోయిందన్నారు. ‘అందుకు వాళ్లు నాపై ఆగ్రహంగా కూడా ఉన్నారు.
విధి లేని పరిస్థితుల్లో మాత్రమే మహిళా బిల్లుకు వాళ్లు మద్దతిచ్చారు. ఇప్పుడిక మోదీకి మహిళలంతా ఎక్కడ మద్దతు పలుకుతారోనని భయపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను ఓబీసీలకు కూడా వర్తింపజేయాలంటూ కొత్త నాటకానికి కాంగ్రెస్ తెర తీసింది. తద్వారా మహిళల మధ్యా విభేదాలు రాజేసేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆరోపించారు. ‘మహిళా రిజర్వేషన్ల ప్రభావం వేలాది ఏళ్ల పాటు ఉంటుంది. మీ కూతుళ్ల భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది’ అని అన్నారు. ‘అమ్మలరా. అక్కాచెల్లెళ్లారా! కాంగ్రెస్ వంటి అబద్ధాలకోర్ల వలలో పడకండి. నాకు మీ ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. అప్పుడే మీతో పాటు ప్రతి ఒక్కరి ఆకాంక్షలనూ నెరవేర్చగలుగుతా’ అని పేర్కొన్నారు.
అవినీతి కూపంలో కాంగ్రెస్
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మోదీ ఆరోపించారు. ఖజానాలో డబ్బులకు కొదవే లేదని, కేంద్రం నుంచి వేలాది కోట్లు వస్తున్నాయని సాక్షాత్తూ ఆ పారీ్టకి చెందిన ఉప ముఖ్యమంత్రే వేదికపై చెప్పారని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో ప్రతి స్కీమ్‌లోనూ స్కామే. ఆ పారీ్టకి గనక మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మరింత దోచుకుంటుంది’ అని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment