arrogant
-
మరో నాలుగేళ్లు భరించలేం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నాయకుడు బరాక్ ఒబామా విరుచుకుపడ్డారు. అహంకారి, అసమర్థుడు, బడాయికోరు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు మనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాంటి వ్యక్తిని మరో నాలుగేళ్లపాటు మనం భరించలేమని అన్నారు. పేజీ తిప్పేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు తిరగబడే పరిస్థితి రాకుండా కలిసి పనిచేసేలా ఉత్తమమైన పేజీ మన కోసం సిద్ధమవుతోందని తెలిపారు. అధ్యక్షురాలు కమలా హారిస్ కోసం మనం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో గురువారం డెమొక్రటిక్ పార్టీ ప్రచార కార్యక్రమంలో బరాక్ ఒబామా మాట్లాడారు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న పన్ను విధానం, విదేశాంగ విధానాన్ని తప్పుపట్టారు. ట్రంప్ పచ్చి అబద్ధాలకోరు అని మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం రిపబ్లికన్లకు తుపాను సాయం అందించలేదంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. అమెరికా విలువలను ఉల్లంఘించవద్దని ట్రంప్‌నకు సూచించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని, రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని ఒబామా స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు హారిస్ సర్వసన్నద్ధంగా ఉన్నారని ఒబామా తేల్చిచెప్పారు. ఆమె విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. కమలా హారిస్‌ను గెలిపిస్తే ఆమె తన సొంత సమస్యలపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తారని వివరించారు. ప్రజల కష్టాలు ఏమిటో ఆమెకు క్షుణ్నంగా తెలుసని చెప్పారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకుంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రంప్ వస్తే సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు తగ్గిస్తారని, సామాన్య ప్రజలపై పన్నులు పెంచుతారని అన్నారు. మెరుగైన జీవితం, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించుకోవాలని అమెరికా ప్రజలకు ఒబామా పిలుపునిచ్చారు. -
ఓడితే మగాడు కాదా?.. కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ చిల్లరగా మాట్లాడటం ఇకనైనా మానాలని.. తన సవాల్‌కు స్పందించి మల్కాజ్‌గిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడితే మగాడు కాదా?. నా సవాల్‌ను రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్‌గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు మగాడో తేల్చుకుందాం అని రేవంత్‌ను కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. మా అయ్య పేరు కేసీఆర్. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అంతేగానీ రేవంత్‌రెడ్డిలాగా రాంగ్ రూట్లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్ సీఎం అయ్యారు. కారు కూతలు, చిల్లర మాటలు రేవంత్ ఇకనైనా మానుకోవాలి. సీఎంలాగా హుందాగా మాట్లాడాలి.. .. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే.. అందులో మూడు కుంగిన మాట వాస్తవం. అంతేకానీ కాళేశ్వరం, మేడిగ్డ కొట్టుకుపోలేదు. మూడు నెలల సమయంలో ఈ ప్రభుత్వానికి పిల్లర్లు బాగు చేసే సమయం దొరకడం లేదా?. ఈ నెల 17వ తేదీ వరకు ఓపిక పడతాం. కాంగ్రెస్ పాలన వంద రోజులు అయ్యాక ప్రజల్లోకి వెళ్తాం. గొర్రె కసాయివాడ్ని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. రుణమాఫీ చేయకపోతే రైతులు కాంగ్రెస్ భరతం పడతారు అని కేటీఆర్ హెచ్చరించారు. ఇక చివర్లో.. కామారెడ్డి ఫలితం చేదు అనుభవం మిగిల్చిందన్న కేటీఆర్ ఆ ఎన్నికలపై చర్చ వద్దంటూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. -
బీసీననే నాపై ద్వేషం: ప్రధాని మోదీ
బిలాస్పూర్: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాల ఇండియా కూటమిని అహంకారుల గ్రూప్‌గా, కాంగ్రెస్‌కు తానంటే ఎనలేని ద్వేషమని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘అసలు బీసీలన్నా, ఎస్సీలు, ఎస్టీలన్నా, ముఖ్యంగా పేదలన్నా ఆ పారీ్టకి ఎనలేని ద్వేషం. అందుకే కాంగ్రెస్ వాళ్లు నన్ను నోటికొచి్చనట్టు తిట్టిపోస్తుంటారు. ఆ నెపంతో వాళ్లు అవమానించేది నిజానికి బీసీలను’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు శిక్షించినా వారి వైఖరి అసలే మారలేదని దుయ్యబట్టారు. ‘రాష్ట్రపతి పదవికి దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ అభ్యరి్థత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. తాజాగా ఆదివాసీ మహిళ అయిన ద్రౌపదీ ముర్ము అభ్యర్థిత్వాన్నీ అలాగే వ్యతిరేకించింది. ఆయా సామాజికవర్గాల పట్ల ద్వేషమే అందుకు కారణం తప్ప సైద్ధాంతిక విభేదాలు కాదు. లేదంటే యశ్వంత్ సిన్హా వంటి మాజీ బీజేపీ నేతను పోటీగా బరిలో దింపేవారే కాదు’ అని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం బిలాస్పూర్లో బీజేపీ నిర్వహించిన ‘పరివర్తన్ మహాసంకల్ప’ ర్యాలీలో మోదీ మాట్లాడారు. 30 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏమీ చేయని కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీల అహంకార గ్రూప్ తాను బిల్లును ఆమోదం దాకా తీసుకెళ్లడం చూసి ఆశ్చర్యపోయిందన్నారు. ‘అందుకు వాళ్లు నాపై ఆగ్రహంగా కూడా ఉన్నారు. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే మహిళా బిల్లుకు వాళ్లు మద్దతిచ్చారు. ఇప్పుడిక మోదీకి మహిళలంతా ఎక్కడ మద్దతు పలుకుతారోనని భయపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను ఓబీసీలకు కూడా వర్తింపజేయాలంటూ కొత్త నాటకానికి కాంగ్రెస్ తెర తీసింది. తద్వారా మహిళల మధ్యా విభేదాలు రాజేసేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆరోపించారు. ‘మహిళా రిజర్వేషన్ల ప్రభావం వేలాది ఏళ్ల పాటు ఉంటుంది. మీ కూతుళ్ల భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది’ అని అన్నారు. ‘అమ్మలరా. అక్కాచెల్లెళ్లారా! కాంగ్రెస్ వంటి అబద్ధాలకోర్ల వలలో పడకండి. నాకు మీ ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. అప్పుడే మీతో పాటు ప్రతి ఒక్కరి ఆకాంక్షలనూ నెరవేర్చగలుగుతా’ అని పేర్కొన్నారు. అవినీతి కూపంలో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మోదీ ఆరోపించారు. ఖజానాలో డబ్బులకు కొదవే లేదని, కేంద్రం నుంచి వేలాది కోట్లు వస్తున్నాయని సాక్షాత్తూ ఆ పారీ్టకి చెందిన ఉప ముఖ్యమంత్రే వేదికపై చెప్పారని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో ప్రతి స్కీమ్‌లోనూ స్కామే. ఆ పారీ్టకి గనక మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మరింత దోచుకుంటుంది’ అని దుయ్యబట్టారు. -
పోలీసులు నోటీసులు... అసదుద్దీన్ విమర్శలు!
బెంగళూరు: గతంలో బీజీపీపై అస్త్రాలు ఎక్కుపెట్టిన ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. కర్ణాటక బీజాపూర్ లో నిర్వహించదలచుకున్న ఏఐఎంఐఎం బహిరంగ సభకు అసద్ హాజరు కావొద్దంటూ బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ ఇతెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ కర్ణాటకలో నిర్వహించనున్న బహిరంగ సభకు అసదుద్దీన్ కు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు పంపించారు. ఎంఐఎం పార్టీ సభ నిర్వహణకు పోలీసులను అనుమతి కోరగా అందుకు నిరాకరించడంతోపాటు... అసద్ కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు నోటీసులు పంపించడంతో ఆగ్రహించిన ఎంపీ... వారికి పూల బొకేలు ఇచ్చి పంపించడమే కాక, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. జూన్ 1న బీజాపూర్ లో నిర్వహించే బహిరంగ సభకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని, ''ఇదేనా సమానత్వం అంటే... ఇక మీకూ బీజేపీ కి తేడా ఏముంది?'' అంటూ అసద్ తన ట్వీట్లో విమర్శలు గుప్పించారు. ''గత 30 రోజుల్లో మహరాష్ట్రలో 5 సభలను నిర్వహించాను, తమిళనాడులో 3 ఎలక్షన్ మీటింగ్స్ నిర్వహించాను, అయితే ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడేలా వ్యవహరిస్తోంది'' అంటూ మరో ట్వీట్లో ఎస్. సిద్ధిరామయ్య ప్రభుత్వమే లక్ష్యంగా అసదుద్దీన్.. విమర్శించారు. ఇటీవల భారత్ మాతాకీ జై అనడాన్ని వ్యతిరేకించి... అసద్ అనేక విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. Congress is in power few states but arrogance and blatant disregard for constitution continues Stop Preaching pic.twitter.com/ytL0CoM0m4 — Asaduddin Owaisi (@asadowaisi) May 31, 2016 Congress party prohibits my entry Bijapur K/tka is this your Tolerance ,what is difference b/w BJP & congress pic.twitter.com/KDGmT8utLg — Asaduddin Owaisi (@asadowaisi) May 31, 2016