Ind vs NZ 2nd ODI: Rohit and Co Receives a Grand Welcome in Raipur, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ind Vs NZ: రాయ్‌పూర్‌లో రోహిత్‌ సేనకు ఘన స్వాగతం.. వీడియో వైరల్‌

Published Fri, Jan 20 2023 11:13 AM | Last Updated on Fri, Jan 20 2023 11:54 AM

Ind Vs NZ 2nd ODI: Rohit And Co Reach Raipur Grand Welcome Viral - Sakshi

రాయ్‌పూర్‌కు చేరుకున్న టీమిండియా (PC: BCCI)

India Vs New Zealand 2nd ODI: హైదరాబాద్‌ వన్డేలో విజయంతో సిరీస్‌ ఆరంభించిన టీమిండియా తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో అడుగుపెట్టింది. రోహిత్‌ సేనతో పాటు న్యూజిలాండ్‌ జట్టు సైతం రాయ్‌పూర్‌కు చేరుకుంది. 

ఘన స్వాగతం
ఈ క్రమంలో ఆతిథ్య, పర్యాటక జట్లకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ నృత్య వేడుక నడుమ టీమిండియాను హోటల్‌ సిబ్బంది ఆహ్వానించింది. కివీస్‌ జట్టుకు సైతం అదే స్థాయిలో అతిథి మర్యాదలు చేసింది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్‌ తరలివచ్చారు.

ఇందుకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ, బ్లాక్‌కాప్స్‌ తమ సోషల్‌ మీడియాల ఖాతాల్లో షేర్‌ చేయగా వైరల్‌గా మారాయి. కాగా మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్‌ ఆడే నిమిత్తం న్యూజిలాండ్‌ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా టీమిండియా- కివీస్‌ మధ్య బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా తొలి వన్డే జరిగింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఎట్టకేలకు 12 పరుగుల తేడాతో గెలుపొంది భారత జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

ఇక ఇరు జట్ల మధ్య రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియంలో రెండో మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకోసం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకే రోహిత్‌ సేన ప్రాక్టీసు ఆరంభించనుంది. 

చదవండి: Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్‌.. హ్యాట్రిక్‌ విజయాలు.. ఫ్యాన్స్‌ ఖుషీ! ఈసారి..
ఎలా ఔటయ్యాడో చూడు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు.. గిల్‌ తండ్రి అసంతృప్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement