రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్‌మా జిల్లాలో శనివారం మావోయిస్టులు సీఏఎఫ్ చెందిన శివకుమార్ సిదార్ అనే జవానును హతమార్చారు. శనివారం జిల్లాలోని తెమిలివాడ క్యాంపులో జవానుగా పనిచేస్తున్న శివకుమార్ అనారోగ్య కారణంగా బస్సులో దోర్నపాల్ కు వస్తుండగా అటవీప్రాంతంలో బస్సును అడ్డగించిన మావోయిస్టులు అతనిని వెంట తీసుకెళ్లారు. రెండు గంటల తర్వాత శివకుమార్‌ను హతమార్చి మృత దేహాన్ని రహదారిపై పడేశారు.
అనంతరం సమాచారం తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని అక్కడ్నుంచి తరలించారు. సీఎఎఫ్ 9వ బెటాలియన్ కు చెందిన శివకుమార్ ను మావోయిస్టులు హతమార్చడంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి తెలిపారు.