![Anand Mahindra Reacted on Bored Guard Draws Eyes on Painting Worth Crores - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/10/NFT_Paintind.jpg.webp?itok=T6Gpxf2M)
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆనంద్ మహీంద్రా పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు. అయితే, తాజాగా మరో ఆసక్తికర పోస్టుపై మహీంద్రా స్పందించారు. రష్యాలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక కొన్ని కోట్లు విలువైన పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. అయితే, ఈ వార్తాపై స్పందించిన ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా.." ఎందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త కళాఖండాన్ని ఎన్‌ఎఫ్‌టిగా మార్చండి" అని సూచించారు.
వివరాల్లోకి వెళ్తే.. 1932-1934 నాటి త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్‌ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్ సెంటర్‌లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్‌ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది.
Why worry? Just convert the new ‘creation’ into an NFT! https://t.co/I7F3wbIxWH
— anand mahindra (@anandmahindra) February 10, 2022
ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన వేశారు. అయితే ఈ పేయింటింగ్ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ, ఈ పెయింటింగ్‌ని దాదాపు రూ.7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్ కంపెనీ ఆ పేయింటింగ్ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
(చదవండి: ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న 10 నగరాల్లో 2 మనవే..!)
Comments
Please login to add a commentAdd a comment