బాడీగార్డ్‌ చెంప పగలగొట్టిన సల్మాన్‌! | Salman Khan Slaps Security Guard | Sakshi
Sakshi News home page

బాడీగార్డ్‌ చెంప పగలగొట్టిన సల్మాన్‌!

Published Wed, Jun 5 2019 6:57 PM | Last Updated on Wed, Jun 5 2019 6:57 PM

Salman Khan Slaps Security Guard  - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘భారత్‌’ బుధవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిక్స్‌డ్‌ రివ్యూలు వెలువడుతుండగా.. మరోవైపు సల్మాన్‌ చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ తన బాడీగార్డ్‌ చెంప ఛెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి వచ్చినట్టు కనిపిస్తున్న సల్మాన్‌.. వాహనం నుంచి దిగివస్తుండగా అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. నడుస్తూ వెళ్తున్న సల్మాన్‌ ఫొటోలు తీసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడుతుండటంతో.. ఆయనకు ఇబ్బంది కలుగకుండా బాడీగార్డులు రక్షణవలయంగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో  కొంతదూరం నడిచాక ఒక్కసారిగా వెనకితిరిగిన సల్మాన్‌ ఓ బాడీగార్డ్‌కు వార్నింగ్‌ ఇస్తూ చెంప పగలగొట్టారు. ఈ ఘటన వీడియోలో రికార్డ్‌ అయింది. ఓ బాల అభిమాని సల్మాన్‌ వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా బాడీగార్డు అతనితో దురుసుగా ప్రవర్తించి.. పక్కకు తోసేశాడని, ఇది గమనించి సల్మాన్‌ బాడీగార్డ్‌ చెంపపగలగొట్టాడని వినిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement