అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌ | Salman Khan Says No Woman Has Proposed Marriage to Him | Sakshi
Sakshi News home page

‘పెళ్లి చేసుకుందామని ఏ అమ్మాయి అడగలేదు’

Published Wed, Jul 24 2019 5:26 PM | Last Updated on Wed, Jul 24 2019 8:39 PM

Salman Khan Says No Woman Has Proposed Marriage to Him - Sakshi

భారత్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే అది కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు బాలీవుడ్‌ కండలవీరుడు స‌ల్మాన్ ఖానే(53). అయితే తన జీవితంలో ఇప్పటి వరకు ఏ అమ్మాయి పెళ్లి చేసుకుందామని అడగలేదని, అందుకే పెళ్లి చేసుకోలేదని ఈ బాలీవుడ్‌ స్టార్‌ హీరో తెలిపాడు. తాజాగా సల్మాన్, బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటించిన ‘భారత్’ సినిమాలో సల్మాన్ ముందు కత్రినా పెళ్లి ప్రపోజల్‌ తీసుకువచ్చిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలపై ఫిల్మ్‌ఫేర్‌ కార్యక్రమంలో సల్మాన్‌ సరదాగా స్పందించాడు. రీల్‌ లైఫ్‌లో జరిగిన ఈ ఘటన రియల్‌ లైఫ్‌లో జరగలేదని బాధపడ్డాడు.

‘నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటిదెప్పుడూ జరగలేదు. ఎందుకంటే నేనెప్పుడు క్యాండిల్‌లైట్‌ డిన్నర్స్‌ చేయలేదు. క్యాండిల్‌ లైట్‌లో నేనేం తింటున్నానో కూడా చూడలేను. కానీ ఏ అమ్మాయి పెళ్లి ప్రపోజల్‌ తీసుకురాలేదని మాత్రం బాధపడుతున్నాను’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారత్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ హిట్‌ అనంతరం కండలవీరుడు దబాంగ్ 3 చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement