
మాజీ పీఎం గార్డ్ చెంప చెళ్లుమనిపించిన యువతి
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సెక్యూరిటీ గార్డ్ చెంప చెళ్లుమంది.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సెక్యూరిటీ గార్డ్ చెంప చెళ్లుమంది. ఢిల్లీలోని డబ్లూడబ్లూఎఫ్ ఆడిటోరియంలో జరుగుతున్న ఓ పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యేందుకు వెళుతున్న ఓ యువతిని ఆపినందుకు.. సెక్యూరిటీ గార్డ్‌ను ఇలా చెంప చెళ్లుమనిపించింది.
ఆ కార్యక్రమానికి రావాల్సిన సమయం కన్నా మన్మోహన్ సింగ్ ముందే రావడంతో ఆడిటోరియంలోకి జర్నలిస్టులను, పుస్తకాభిమానులను మన్మోహన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది నియంత్రించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఈనెల పదవ తేదీన జరగ్గా బుధవారం ఆ అమ్మాయిని టర్కీ దేశస్థురాలిగా గుర్తించి కేసు పెట్టారు. ఆమె సిక్యూరిటీ గార్డ్‌ను చెంప చెళ్లుమనిపిస్తున్న దృశ్యం ఇప్పుడు సామాజిక వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తోంది.