సాక్షి, హైదరాబాద్ : నిమ్స్ లో విధి నిర్వహణలో ఉన్న సురేశ్ అనే సెక్యూరిటీ సూపర్ వైజర్ పై మెడికల్ రిప్రజెంటేటివ్ దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ దాడి జరగ్గా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వాహనాలకు అనుమతి లేని స్థలంలో నిలిపినందుకు సెక్యూరిటీ సూపర్ వైజర్ సురేశ్ అభ్యంతరం తెలిపాడు. ఓ కంపెనీకి చెందిన పది మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ నిమ్స్ లోని క్యాంటీన్ సమీపంలో వాహనం నిలిపి అక్కడే గుంపుగా నిల్చొని మాట్లాడుకుంటున్నారు. అధికారుల ఆదేశం మేరకు సెక్యూరిటీ సూపర్ వైజర్.. వారిని అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా సూచించాడు. పార్కింగ్ చేసిన వాహనాన్ని తీసుకెళ్లాల్సిందిగా కోరాడు.
నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన మెడికల్ రిప్రజెంటేటివ్ ను గట్టిగా నిలదీశాడు. దీంతో గుంపులోని ఓ వ్యక్తి సురేష్ పై దాడి చేశాడు. కిందపడేసి కొట్టడంతోపాటు బూతులు తిట్టాడు. ఈ విషయాన్ని సదరు సెక్యూరిటీ సూపర్ వైజర్ సురేష్ నిమ్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేకపోయింది. పైగా దాడి చేసిన మెడికల్ రిప్రజెంటేటివ్ తో రాజీ కుదుర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలిసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సురేష్ ఫిర్యాదు చేశాడు. వాహనాల పార్కింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఓ వైపు చెబుతుండగా ఉల్లంఘన దారులతో రాజీ కుదుర్చుకోవాలని నిమ్స్ అధికారులు చెబుతుండటం వల్ల కిందిస్థాయి సిబ్బంది మనోస్థైర్యం కోల్పోతున్నారు.
నిమ్స్ వద్ద దాడి.. షాకింగ్ వీడియో
Published Sat, Dec 16 2017 6:21 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
1/1
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment