శంషాబాద్(హైదరాబాద్): ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగులోంచి రియాల్స్ తస్కరించిన సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. నిజామాబాద్ డిచ్‌పల్లికి చెందిన షేక్ అల్తాఫుద్దీన్ శుక్రవారం రాత్రి రియాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. బంధువులు, కుటుంబసభ్యులు అరైవల్స్‌లోకి కాకుండా డిపార్చర్ వైపు వెళ్లడంతో హడావుడిగా అల్తాఫుద్దీన్ కూడా అక్కడికి వెళ్లాడు.
చదవండి👉: చిల్.. జిల్.. టాప్ గేర్‌లో అమ్మకాలు.. పొంగుతున్న బీరు
కారు పార్కింగ్ సమయం మించిపోతుందని సిబ్బంది సూచించడంతో బ్యాగు మరచిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఓ బ్యాగు లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఆరా తీశారు. బ్యాగులో 3050 రియాల్స్‌తో పాటు కొన్న ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాగును తీసిన సదరు సెక్యూరిటీ సిబ్బంది తిరిగి అప్పగించినా అందులో కేవలం 500 రియాల్స్ మాత్రమే ఉండడంతో మిగతా రియాల్స్ ఎక్కడిపోయాయని బాధితుడు అడిగాడు. దీంతో మరో ఆరువందల రియాల్స్‌ను అతడికి తిరిగి ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మిగతా రియాల్స్ తమవద్దలేవని చేతులెత్తేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించినట్లు ఆర్‌జీఐఏ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment