Security Guard Bodyslams A Woman To The Ground During A Chaotic Fight In San Antonio - Sakshi
Sakshi News home page

జుట్టు పట్టుకుని కొట్టుకున్న యువతులు.. సెక్యూరిటీ గార్డు రోడ్డుపై ఎత్తి పడేశాడు!

Published Sun, Apr 9 2023 5:00 PM | Last Updated on Sun, Apr 9 2023 8:47 PM

USA: Security Guard Bodyslams Woman To Break Up Violent Fight - Sakshi

ఏం జరిగిందో తెలియదు గానీ నడిరోడ్డుపై ముగ్గురు ఆడవాళ్లు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘర్షణను ఆపాలని చుట్టూ ఉన్న వారు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం దీనికి  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన శాన్ ఆంటోనియోలోని ప్రైవేట్ సోషల్ క్లబ్ వెలుపల చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ నైట్ క్లబ్ ముందు ముగ్గురు మహిళలు ఘర్షణ పడుతున్నారు. వారిని ఆపేందుకు కొందరు ప్రయత్నం చేస్తుండగా.. మరికొందరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత ట్రై చేసినా మహిళల గొడవను మాత్రం ఆపలేకపోయారు. ఇంతలో వారి మధ్యకు ఓ నైట్‌ క్లబ్‌ సెక్యూరిటీ వచ్చి వారిని విడదీసేందుకు ప్రయత్నించాడు. అయినా లాభం లేకుండా పోయింది. ఇది చూసిన సెక్యూరిటీ గార్డు ఘర్షణ పడుతున్న ఒక మహిళను అమాంతం పైకి లేపి రోడ్డుపై ఎత్తేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

దీనంతటినీ ఆ ప్రాంతంలోని కొందరు వీడియోలు తీసి పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకునే సరికి ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ పట్ల సెక్యూరిటీ గార్డ్‌ ప్రవర్తించిన తీరుని తప్పుపడుతున్నారు. గొడవ ఆపాల్పింది పోయి నిన్ను కొట్టమనలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement