దారుణం.. సెక్యూరిటీని కాల్చి తుపాకీతో పరార్! | Gun fire at Delhis Majra Dabas SBI ATM | Sakshi
Sakshi News home page

దారుణం.. సెక్యూరిటీని కాల్చి తుపాకీతో పరార్!

Published Thu, Nov 16 2017 11:24 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

Gun fire at Delhis Majra Dabas SBI ATM - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో కాల్పుల కలకలం రేగింది. మజ్రాదబాద్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో బుధవారం పట్టపగలే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న తుపాకీని లాక్కెళ్లిపోయారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అసలేం జరిగిందంటే..
మజ్రాదబాద్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్ వద్ద ఓ సెక్యూరిటీ గార్డు కాపాలా ఉన్నాడు. మరో వ్యక్తి ఏటీఎం సెంటర్లో ఉన్నాడు. ఆ సమయంలో హెల్మెట్లు పెట్టుకుని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. వచ్చీ రాగానే సెక్యూరిటీ తొలుత గార్డుపై కాల్పులు జరిపారు. ఏటీఎం సెంటర్ లోపల ఉన్న వ్యక్తిని కూడా కొట్టిన దుండగులు సెక్యూరిటీ దగ్గరున్న తుపాకీ లాక్కొనేందుకు యత్నించారు. సెక్యూరిటీ గార్డు ప్రతిఘటించడంతో గాల్లో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. తర్వాత బలవంతంగా తుపాకీ లాక్కొని బైక్‌పై పరారయ్యారు.

సెక్యూరిటీని కాల్చి తుపాకీతో పరారయ్యారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement