టీ20 వరల్డ్ కప్‌లో సెక్యురిటీగార్డు అద్బుత క్యాచ్ | A security guard takes a stunner | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్ కప్‌లో సెక్యురిటీగార్డు అద్బుత క్యాచ్

Published Sat, Mar 19 2016 11:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

A security guard takes a stunner

ముంబై:
ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల మధ్య వాంఖడే మైదానంలో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ   మ్యాచ్‌లో ఇరు జట్లు పరుగుల వరద కురిపించాయి. అయితే ఈ మ్యాచ్‌లో  దక్షిణాఫ్రికా విసిరిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లు ఛేదించే క్రమంలో బౌండరీ అవతల ఉన్న సెక్యురిటీగార్డు ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి ప్రేక్షకులు దృష్టిని ఆకర్షించాడు. బౌండరీ లైన్ అవతలకు వేగంగా వస్తున్న బంతిని ఒంటి చేత్తో చాలా సులభంగా పట్టుకున్నాడు.

16వ ఓవర్లో జో రూట్(44 బంతుల్లో 83; 6 ఫోర్లు; 4 సిక్సర్లు) ఓ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అయితే బౌండరీ దాటి వేగంగా వస్తున్న ఆ బంతిని సెక్యురిటీ గార్డు చాలా సునాయాసంగా పట్టుకొని ఎలాంటి హావ భావాలు లేకుండా తిరిగి బంతిని గ్రౌండ్‌లోకి వేశాడు. దీన్ని చూసిన వారిలో చాలా మంది ఇంత సునాయాసంగా బంతిని పట్టుకున్న వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement