
టీ20 వరల్డ్ కప్‌లో సెక్యురిటీగార్డు అద్భుత క్యాచ్
ముంబై:
ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల మధ్య వాంఖడే మైదానంలో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పరుగుల వరద కురిపించాయి. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విసిరిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లు ఛేదించే క్రమంలో బౌండరీ అవతల ఉన్న సెక్యురిటీగార్డు ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి ప్రేక్షకులు దృష్టిని ఆకర్షించాడు. బౌండరీ లైన్ అవతలకు వేగంగా వస్తున్న బంతిని ఒంటి చేత్తో చాలా సులభంగా పట్టుకున్నాడు.
16వ ఓవర్లో జో రూట్(44 బంతుల్లో 83; 6 ఫోర్లు; 4 సిక్సర్లు) ఓ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అయితే బౌండరీ దాటి వేగంగా వస్తున్న ఆ బంతిని సెక్యురిటీ గార్డు చాలా సునాయాసంగా పట్టుకొని ఎలాంటి హావ భావాలు లేకుండా తిరిగి బంతిని గ్రౌండ్‌లోకి వేశాడు. దీన్ని చూసిన వారిలో చాలా మంది ఇంత సునాయాసంగా బంతిని పట్టుకున్న వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తారు.