Nora Fatehi Gets Trolled For Making Security Guard Lifting Her Saree - Sakshi
Sakshi News home page

Nora Fatehi: హాట్‌ బ్యూటీపై నెటిజన్ల ఘాటు కామెంట్లు..

Jul 5 2022 8:51 PM | Updated on Jul 5 2022 10:52 PM

Nora Fatehi Gets Trolled For Making Guard Lifting Her Saree - Sakshi

డ్యాన్స్‌ రియాలిటీ షో అయిన 'డ్యాన్స్‌ దీవానే జూనియర్స్‌'కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో పాల్గొనేందుకు నోరా చీరలో వచ్చింది. ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తుంది. వర్షంలో కారు దిగబోతుండగా అక్కడ నీటిలో చీర తడిసిపోతుందని భావించి సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకుంది.

Nora Fatehi Gets Trolled: బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నోరా ఫతేహీ తనదైన హావాభావాలతో, డ్యాన్స్‌ మూమెంట్స్‌తో కట్టిపడేస్తుంది. 'టెంపర్‌' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అనే ఐటమ్‌ సాంగ్‌తో టాలీవుడ్‌లో ఎంటరైన ఈ భామ 'బాహుబలి' చిత్రంలో 'మనోహారి' పాటతో పాపులారిటీ దక్కించుకుంది. హిందీలో 'దిల్‌బర్‌' సాంగ్‌తో ఒక ఊపు ఊపేసింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రోలర్స్ చేతికి చిక్కింది. తాజాగా ఆమె చేసిన ఓ పని నెటిజన్స్‌ విరుచుకుపడేలా చేసింది. 

డ్యాన్స్‌ రియాలిటీ షో అయిన 'డ్యాన్స్‌ దీవానే జూనియర్స్‌'కు నోరా ఫతేహీ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో పాల్గొనేందుకు నోరా చీరలో వచ్చింది. ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తుంది. వర్షంలో కారు దిగబోతుండగా అక్కడ నీటిలో చీర తడిసిపోతుందని భావించి సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకుంది. సెక్యూరిటీ గార్డు ఆమె చీరను పట్టుకోగా నోరా ఫతేహీ కార్‌వ్యాన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా నోరాను నెటిజన్స్‌ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. 

(చదవండి: 72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు
చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు కారణం ఇదే !)

'ఆమె ఏ దేశపు యువరాణి', 'ఈ శతాబ్దంలో ఇలాంటి బానిసత్వాన్ని అంగీకరించలేం', 'ఆమె మహారాణి అయినప్పటికీ సెక్యూరిటీ గార్డ్‌పై కొంచెం కూడా దయలేదా. చీరను కాపాడేందుకు అతను వర్షంలో తడిసేలా చేసింది', 'ఒక గొడుగును కొనుక్కునేందుకు ఆమె దగ్గర డబ్బులు లేవా ?' అంటూ నెటిజన్స్‌ ట్రోలింగ్‌కు దిగారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement