ఏటీఎం గార్డ్‌కు క్రికెటర్‌ సెల్యూట్‌! | VVS Laxman Salutes Dehradun ATM Guard  | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 24 2018 7:13 PM | Last Updated on Fri, Aug 24 2018 7:16 PM

VVS Laxman Salutes Dehradun ATM Guard  - Sakshi

సెక్యూరిటీ గార్డ్‌ బ్రిజేందర్‌ సింగ్‌

హైదరాబాద్‌ : ఓ ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌ చేసే మంచి పనికి టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ముగ్ధుడయ్యాడు. అతని సేవను ప్రశంసిస్తూ ట్విటర్‌ వేదికగా సెల్యూట్‌ కొట్టాడు. డెహ్రాడూన్‌లో ఓ ఏటీఎంకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిసున్న రిటైర్డ్‌ సైనికుడు బ్రిజేందర్‌ సింగ్‌ దేశం కోసం తన సేవను కొనసాగిస్తున్నాడు. ఆ ప్రాంతంలోని నిరూపేద పిల్లలను చేరదీసి చదువుచెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్‌.. అతని సేవను కొనియాడుతూ వారికి చదువు చెబుతున్న ఫొటోలను  ట్వీట్‌ చేశాడు.

‘రియల్‌ హీరో బ్రిజేంద్రను కలవండి.. ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈ మాజీ సైనికుడు దేశం కోసం తన సేవను ఇంకా కొనసాగిస్తున్నాడు. సాయంకాలంవేల ఏటీఎం వెలుగుల్లో అక్కడి మురికివాడలకు చెందిన పిల్లలకు చదువు చెబుతున్నాడు. ఈ మహోన్నత వ్యక్తికి నా సెల్యూట్‌’ అని ట్వీట్‌ చేశాడు. ఆ సెక్యూరిటీ గార్డ్‌ సేవలను కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement