
సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగి చనిపోయారనేది అవాస్తవమని ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ సుష్మా అన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కరోనా లక్షణాలతో ఓ రోగి చనిపోయారని, దీంతో అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వమనేసరికి ఇటువంటి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఆస్పత్రిపై దుష్ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా కష్ట సమయంలో ఎంతో శ్రమిస్తున్న వైద్యులపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఎంతో మంది పేద రోగులు ఆస్పత్రికి వస్తున్నారని, ఇలాంటి సమయంలో తప్పుడు ప్రచారం చేసి వారిని అయోమయంలో పడేయ్యొద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment