లఖ్‌నవూ: ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో తీవ్ర రక్తస్రావంతో ఓ వ్యక్తి కింద పడిపోయి ఉన్నాడు. అతని చుట్టూ ఓ వీధి కుక్క తిరుగుతున్న హృదయవిదారక సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమానవీయ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరిగింది.
వీడియో ప్రకారం.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో కింద పడిపోయి ఉన్నాడు. చుట్టూ రక్తం పడి ఉంది. ఆ వ్యక్తి ముఖం, తలపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్పృహ తప్పి పడిపోయిన ఆ వ్యక్తి చుట్టూ ఓ వీధి కుక్క సైతం తిరుగుతోంది. 28 సెకన్ల పాటు చూపించిన ఈ వీడియోలో ఎమర్జెన్సీ వార్డుల్లో ఖాళీ పడకల సహా ఏ ఒక్క డాక్టర్, నర్సు సైతం లేరు.
మరోవైపు.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆసుపత్రి ఇన్‌ఛార్జి డాక్టర్ ఎస్‌కే వర్మ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, చికిత్స అందిస్తున్న సమయంలోనే పలుమార్లు బెడ్ పైనుంచి కిందపడిపోయినట్లు చెప్పారు. ఆ వీడియో తీసిన సమయంలో డాక్టర్, వార్డు బాయ్ మరో వార్డులోని ఎమర్జెన్సీ కేసును చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వ్యక్తిని గోరఖ్‌పుర్‌లోని ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు.
The video is from #Kushinagar, #UttarPradesh
— Today Hind (@today__hind) November 3, 2022
In the government hospital, the injured youth lying in a pool of blood is lying on the ground instead of the bed, dogs are licking his blood.
The fate of every hospital is not like Morbi, which is brightened overnight. pic.twitter.com/5PM5di0Lxv
ఇదీ చదవండి: ‘ఒక్క ఉదాహరణ చూపితే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్
Comments
Please login to add a commentAdd a comment